Share News

Gold and Silver Price: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయ్..

ABN , Publish Date - Feb 15 , 2024 | 06:50 AM

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం. కానీ ఈ రేంజ్ మార్పులు, చేర్పులు మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గినా, పెరిగినా 10 గ్రాములకు రూ.10కి మించి జరగడం లేదు.

Gold and Silver Price: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయ్..

Gold and Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు సర్వసాధారణం. కానీ ఈ రేంజ్ మార్పులు, చేర్పులు మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గినా, పెరిగినా 10 గ్రాములకు రూ.10కి మించి జరగడం లేదు. ఇక ఇది పరిగణలోకి తీసుకోవాల్సింది కాదు కాబట్టి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

బంగారం కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం. నేడు కూడా బంగారం ధర రూ.10 మాత్రమే తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 22 గ్రాముల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,990 కాగా.. 24 గ్రాముల బంగారం ధర (10 గ్రాములు) రూ.62,170 గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి ధరపై ఎప్పటి మాదిరిగానే రూ.100 తగ్గింది. నేడు కిలో వెండి ధర రూ.73,900గా ఉంది.

Updated Date - Feb 15 , 2024 | 07:10 AM