Stock Market: నష్టాలతో ముగిసిన దేశీయ సూచీలు..
ABN , Publish Date - Jan 20 , 2024 | 03:43 PM
దేశీయ మార్కెట్ సూచీలు శనివారం నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు చివర్లో నష్టాలను మూటగట్టుకున్నాయి.
దేశీయ మార్కెట్ సూచీలు శనివారం నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు చివర్లో నష్టాలను మూటగట్టుకున్నాయి. శనివారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 259 పాయింట్లు కోల్పోయి 71,423 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇక, నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 21,571 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 357 పాయింట్ల లాభంతో 46,058 వద్ద క్లోజ్ అయింది.
బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఐఆర్‌సీటీసీ, అపోలో టైర్స్, ఎమ్‌ఆర్‌ఎఫ్, కోల్ ఇండియా లాభాలను ఆర్జించాయి. హెచ్‌యూఎల్, జేకే సిమెంట్, ఒరాకిల్ ఫిన్‌సెర్వ్, అబాట్ ఇండియా నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు కూడా రైల్వే స్టాక్స్ భారీ లాభాలను ఆర్జించాయి. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం స్టాక్ మార్కెట్లు పని చేయవు. మళ్లీ మంగళవారం ప్రారంభమవుతాయి.