Share News

Saving Tips: టాప్ 5 స్మాల్ క్యాప్ ఫండ్స్.. ఐదేళ్లలో వచ్చే రాబడి ఏంతంటే

ABN , Publish Date - Aug 08 , 2024 | 03:59 PM

ఇటివల కాలంలో మ్యూచువల్ ఫండ్లలో(mutual funds) పెట్టుబడులు (investments) చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ క్రమంలోనే మీరు తక్కువ సమయంలో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తాన్ని పొందాలని చూస్తున్నారా. అందుకోసం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Saving Tips: టాప్ 5 స్మాల్ క్యాప్ ఫండ్స్.. ఐదేళ్లలో వచ్చే రాబడి ఏంతంటే
top 5 small cap funds

ఇటివల కాలంలో మ్యూచువల్ ఫండ్లలో(mutual funds) పెట్టుబడులు (investments) చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ క్రమంలోనే మీరు తక్కువ సమయంలో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తాన్ని పొందాలని చూస్తున్నారా. అందుకోసం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని చెప్పవచ్చు. వీటిలో గత ఐదేళ్లలో రిటర్న్స్ దాదాపు డబుల్ అయ్యాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అస్థిరత నెలకొన్న సమయంలో కూడా వీటిలో మంచి రిటర్న్స్ వచ్చాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ప్రతి నెల ఎంత పెట్టుబడి చేయాలి, ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


గత 5 సంవత్సరాలలో

AMFI (అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్)వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గత 5 సంవత్సరాలలో ఐదు స్మాల్ క్యాప్ ఫండ్‌లు మంచి రిటర్స్న్ అందించాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే సగటున 50% రాబడిని ఇచ్చాయి. ఈ క్రమంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఫండ్ సగటు రాబడి 50% ఉండగా, అత్యల్పంగా 35% వరకు రాబడిని అందించడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక ఇన్వెస్టర్ ఐదేళ్ల క్రితం ఈ ఫండ్స్‌లో రూ. 5000 SIPని ప్రారంభించినట్లయితే, అతని పెట్టుబడి రూ. 10 లక్షలకు పెరిగి డబుల్ అయ్యింది.


1. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అత్యుత్తమ పనితీరు కనబరుస్తుంది. ఆగస్టు 7 నాటికి దీని ఫండ్ పరిమాణం రూ. 22,970 కోట్లు కాగా, NAV రూ. 292గా ఉంది. దీనిలో ఒక పెట్టుబడిదారుడు 5 సంవత్సరాల క్రితం 5000 రూపాయల SIPని ప్రారంభించినట్లయితే, ఈ రోజు వారికి వద్ద దాదాపు 10 లక్షల రూపాయలు లభించేవి. అంటే పెట్టుబడి దాదాపు డబుల్ అవుతుంది.

2. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్

నిప్పాన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ అసెట్ ఆగస్టు 7 నాటికి రూ. 56470 కోట్లు, NAV రూ. 175. దీనిలో ఒక పెట్టుబడిదారుడు ఐదేళ్ల క్రితం రూ. 5000 SIPని ప్రారంభించినట్లయితే, ఈ రోజు అతని వద్ద దాదాపు రూ. 8.13 లక్షలు ఉండేవి.


3. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్

బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ పరిమాణం రూ. 1236 కోట్లు. దీని NAV రూ. 51.5. ఇందులో ఒక పెట్టుబడిదారుడు 5 సంవత్సరాల క్రితం రూ. 5000 సిప్‌ని ప్రారంభిస్తే ఈరోజు వారికి దాదాపు రూ. 7.75 లక్షలు లభిస్తాయి.

4. కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్

కెనరా రోబెకో స్మాల్‌క్యాప్ ఫండ్ నిర్వహణలో ఉన్న ఆస్తి రూ. 11500 కోట్లు కాగా, ఈ ఫండ్ NAV రూ. 40. ఒక పెట్టుబడిదారుడు 5 సంవత్సరాల క్రితం ఈ ఫండ్‌లో రూ. 5000 SIPని ప్రారంభించినట్లయితే, ఈరోజు వారికి రూ. 7.05 లక్షలు లభించేవి.


5. ఎడెల్‌వీస్ స్మాల్ క్యాప్ ఫండ్

ఎడెల్‌వీస్ స్మాల్‌క్యాప్ ఫండ్ గురించి మాట్లాడితే దీని నిర్వహణలో ఉన్న ఆస్తి రూ. 3816 కోట్లు. దీని NAV రూ. 43. ఒక ఇన్వెస్టర్ ఐదేళ్ల క్రితం ఇందులో రూ. 5000 SIPని ప్రారంభించినట్లయితే ఈ రోజు వారికి రూ. 6.95 లక్షల ఫండ్ వచ్చేది.

గమనిక: ఇది పెట్టుబడి సలహా కాదు. మాకు లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. వీటిలో పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తప్పక తీసుకోవాలి.


ఇవి కూడా చదవండి:

Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 08 , 2024 | 04:01 PM