Share News

టీవీఎస్‌ నుంచి రెండు కొత్త బైక్స్‌

ABN , Publish Date - Jul 16 , 2024 | 05:16 AM

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ అపాచీ ఆర్‌టీఆర్‌ సీరిస్‌లో రెండు సరికొత్త 160 సీసీ స్పోర్ట్స్‌ బైక్స్‌ను సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లలో విడుదల చేసింది...

టీవీఎస్‌ నుంచి రెండు కొత్త బైక్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ అపాచీ ఆర్‌టీఆర్‌ సీరిస్‌లో రెండు సరికొత్త 160 సీసీ స్పోర్ట్స్‌ బైక్స్‌ను సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లలో విడుదల చేసింది. అపాచీ ఆర్‌టీ ఆర్‌ 160, ఆర్‌టీఆర్‌ 160 4వీ ధరలు వరుసగా రూ.1,09,990, రూ.1.19,990 (ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయని కంపెనీ ప్రీమియం బిజినెస్‌ హెడ్‌ విమల్‌ సంబ్లీ విలేకరులతో చెప్పారు. సోమవారమే ఈ బైక్స్‌ బుకింగ్‌ ప్రారంభమైంది. బుక్‌ చేసిన వారం పది రోజుల్లోనే ఈ రెండు బైకులను కస్టమర్లకు డెలివరీ చేస్తామని విమల్‌ తెలిపారు.

Updated Date - Jul 16 , 2024 | 05:16 AM