Share News

ఏపీ, గుజరాత్‌ల్లో రెండు కొత్త యూనిట్లు

ABN , Publish Date - Nov 11 , 2024 | 02:35 AM

ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో రెండు కొత్త యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఇంటర్‌ఆర్క్‌ బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ ప్రకటించింది. కంపెనీ ఎండీ అరవింద్‌ నందా ఈ విషయం వెల్లడించారు. ప్రీ ఇంజనీర్డ్‌ బిల్డింగ్‌ పరిశ్రమలో...

ఏపీ, గుజరాత్‌ల్లో రెండు కొత్త యూనిట్లు

2028 నాటికి రూ.2,500 కోట్ల టర్నోవర్‌

ఇంటర్‌ఆర్క్‌ బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో రెండు కొత్త యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఇంటర్‌ఆర్క్‌ బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ ప్రకటించింది. కంపెనీ ఎండీ అరవింద్‌ నందా ఈ విషయం వెల్లడించారు. ప్రీ ఇంజనీర్డ్‌ బిల్డింగ్‌ పరిశ్రమలో గట్టి పట్టున్న కంపెనీకి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లాలోని ఐతవరం, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌, ఉత్తరాఖండ్‌లోని పంత్‌ నగర్‌, కిచ్చ వద్ద నాలుగు ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. వీటికి తోడు ఏపీ, గుజరాత్‌ల్లో కొత్తగా రెండు సమగ్ర యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ఇందు కోసం ఇటీవల పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన రూ.600 కోట్లలో కొంత మొత్తాన్ని ఖర్చు చేయనుంది. కొత్త యూని ట్లు, ఉన్న యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్య విస్తరణ ద్వారా 2028 మార్చి నాటికి రూ.2,500 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు నందా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ రూ.1,293 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది.

Updated Date - Nov 11 , 2024 | 02:35 AM