Share News

ఆగని రూపాయి పతనం

ABN , Publish Date - Dec 03 , 2024 | 05:43 AM

భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 12 పైసలు క్షీణించి 84.72 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్‌ బలపడటంతో పాటు...

ఆగని రూపాయి పతనం

  • సరికొత్త రికార్డు కనిష్ఠానికి డాలర్‌-రూపీ మారకం విలువ

  • మరో 12 పైసల క్షీణత..

  • 84.72కి చేరిక

భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 12 పైసలు క్షీణించి 84.72 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్‌ బలపడటంతో పాటు దేశీయంగా జీడీపీ, మాన్యుఫాక్చరింగ్‌ రంగాల పనితీరు గణాంకాలు నిరాశపర్చడం మన రూపాయికి గండి కొట్టాయి. అమెరికా డాలర్‌ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తే, బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించడంతో రూపాయితో పాటు ఆసియా కరెన్సీలన్నీ బలహీనపడ్డాయని ఫారెక్స్‌ వర్గాలు వెల్లడించాయి. గత శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 పైసలు క్షీణించింది. మున్ముందు డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు 84.50-84.95 శ్రేణిలో కదలాడవచ్చని మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అనూజ్‌ చౌదరి అన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 05:43 AM