Share News

చెల్లింపుల్లో యూపీఐ కింగ్‌

ABN , Publish Date - Dec 16 , 2024 | 05:21 AM

నవంబరుతో ముగిసిన 11 నెలల కాలంలో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) ద్వారా రూ.223 లక్షల కోట్ల విలువైన 15,547 కోట్ల చెల్లింపుల లావాదేవీలు జరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ...

చెల్లింపుల్లో యూపీఐ కింగ్‌

జనవరి -నవంబరు మధ్య కాలంలో రూ.223 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: నవంబరుతో ముగిసిన 11 నెలల కాలంలో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) ద్వారా రూ.223 లక్షల కోట్ల విలువైన 15,547 కోట్ల చెల్లింపుల లావాదేవీలు జరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దేశంలో ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులకు ఇదే నిదర్శనమని పేర్కొంది. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఈ విషయాన్ని పోస్ట్‌ చేసింది. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) 2016లో యూపీఐ సేవలను అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ చెల్లింపులను వేగవంతం, సురక్షితం, సులభతరం చేయడంతో పాటు వ్యక్తులు, చిరు వ్యాపారాలు, వర్తకుల ఆర్థిక సాధికారతను పెంచింది. భారతదేశం నగదు రహిత చెల్లింపుల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు బాటలు వేసింది.

Updated Date - Dec 16 , 2024 | 05:21 AM