Share News

Vanguard : హైదరాబాద్‌లో వాన్‌గార్డ్‌ టెక్నాలజీ కేంద్రం

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:30 AM

అమెరికాకు చెందిన ఇన్వె్‌స్టమెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ వాన్‌గార్డ్‌.. భారత్‌లో తొలి టెక్నాలజీ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ

Vanguard  : హైదరాబాద్‌లో వాన్‌గార్డ్‌ టెక్నాలజీ కేంద్రం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికాకు చెందిన ఇన్వె్‌స్టమెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ వాన్‌గార్డ్‌.. భారత్‌లో తొలి టెక్నాలజీ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ సెంటర్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. అయితే ఈ కేంద్రానికి సంబంధించిన పెట్టుబడులు, ఎంతమంది ఉద్యోగులను నియమించుకుంటుందనే విషయాలను మాత్రం వాన్‌గార్డ్‌ వెల్లడించలేదు. వాన్‌గార్డ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డివిజన్‌ అధికారిగా ఉన్న వెంకటేష్‌ నటరాజన్‌ మాత్రం హైదరాబాద్‌ కేంద్రం అధిపతిగా వ్యవహరించనున్నారని కంపెనీ తెలిపింది. 1975లో కార్యకలాపాలు ప్రారంభించిన వాన్‌గార్డ్‌ ప్రపంచవ్యాప్తంగా 5 కోట్లకు పైగా క్లయింట్లకు ఇన్వె్‌స్టమెంట్‌ ప్రొడక్ట్స్‌, సలహా సేవలు అందిస్తోంది.

Updated Date - Dec 21 , 2024 | 04:30 AM