Share News

ఫెడ్‌ సమీక్షకు ముందు అప్రమత్తత

ABN , Publish Date - Dec 17 , 2024 | 01:06 AM

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ ఒకదశలో 581 పాయింట్లకు పైగా క్షీణించినప్పటికీ, చివర్లో 384.55 పాయింట్ల నష్టంతో 81,748.57 వద్ద స్థిరపడింది...

ఫెడ్‌ సమీక్షకు ముందు అప్రమత్తత

సెన్సెక్స్‌ 385 పాయింట్లు పతనం

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ ఒకదశలో 581 పాయింట్లకు పైగా క్షీణించినప్పటికీ, చివర్లో 384.55 పాయింట్ల నష్టంతో 81,748.57 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 100.05 పాయింట్లు కోల్పోయి 24,668.25 వద్దకు జారుకుంది. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ వారంలో వడ్డీరేట్ల తగ్గింపుపై తన నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో ఈక్విటీ మదుపరులు ముందు జాగ్రత్తగా అమ్మకాలకు పాల్పడ్డారు. రూపాయి క్షీణతతో పాటు నిరాశాజనక చైనా ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మరింత కుంగదీశాయి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 24 నష్టపోయాయి.


  • భారత కరెన్సీ సరికొత్త జీవనకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి రూ.84.91 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, అమెరికా బాండ్ల రిటర్నుల రేటు పెరగడం ఇందుకు కారణం.

  • ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,150 తగ్గి రూ.78,350కి జారుకుంది. కిలో వెండి రూ.300 తగ్గుదలతో రూ.92,500గా నమోదైంది.

Updated Date - Dec 17 , 2024 | 01:06 AM