Bank Locker Key: బ్యాంక్ లాకర్ కీ పోయిందా? జస్ట్ ఇలా చేయండి
ABN , Publish Date - Dec 03 , 2024 | 09:00 PM
మీ బ్యాంక్ లాకర్ కీని మీరు పోగొట్టుకుంటే.. తొలుత వెంటనే సంబంధిత బ్యాంక్ కు తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి.. ఎఫ్ఐఆర్ కాఫీ తీసుకోవాలి.
ప్రస్తుతం రోజులు రోజుల్లా లేవు. ఎక్కడ చూసినా దొంగల భయమే. ఒంటరిగా ఉన్నా.. ఇంటికి తాళం వేసి ఉన్నా.. పగలు కనిపెడతారు. అదును చూసి ఇంటికి కన్నం వేసేస్తారు. దొంగల పనే ఇది. ఇక మన పక్క పోర్సన్‍లోనో.. లేదా ఆ పక్కన ఎక్కడో ఇంట్లో అద్దెకు ఉంటారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో అదను చూసి.. తాళాలు పగలు కొట్టి.. ఒంటరిగా ఉంటే వారిపై దాడి చేసి.. బంగారం, నగదుతో మొత్తం ఊడ్చేసి ఉడాయించేస్తారు. ప్రతి నిత్యం ఇటువంటి వార్తలు.. పత్రికల్లో చూస్తునే ఉన్నాం.
Viral News: ఒకరు ఆవలిస్తే, మిగిలిన వారు.. ఎందుకు.. కారణమేమిటి?
అలాంటి వేళ.. ఇంటి కంటే గుడి పదిలం అన్నట్లుగా.. బంగారం, నగదు, విలువైన డాక్యమెంట్లను ఇంట్లో ఉంచుకోవడం కంటే.. బ్యాంక్ లాకర్లలో పలువురు భద్రపరుస్తారు. అందుకు ప్రతి నెల ఇంత చొప్పున ఏడాదికి కొంత నగదు చెల్లించవలసి ఉంటుంది. ఆ క్రమంలో లాకర్ తీసుకున్న వారికి బ్యాంక్ వారు.. ఓ కీ అందజేస్తారు. ఆ కీతోనే లాకర్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఓ వేళ లాకర్ కీ పోయిందనుకొండి. అప్పుడు ఏం చేయాలి? అంటే..
Viral News: ఏఐ ద్వారా సృష్టించిన ఫోటోనా? కాదా? ఇలా సులువుగా గుర్తించండి
కీ పోతే ఏమి చేయాలి?
మీ బ్యాంక్ లాకర్ కీని మీరు పోగొట్టుకుంటే.. తొలుత వెంటనే సంబంధిత బ్యాంక్ కు దీనిని తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి.. ఎఫ్ఐఆర్ కాఫీ తీసుకోవాలి.
Viral News: ఆపరేటర్ చేసిన చిన్న తప్పిదం.. 125 రైళ్ల ఆలస్యానికి కారణమైంది.. ఇంతకీ ఏం జరిగిందంటే..
లాకర్‌ను ఎలా ఉపయోగించాలి?
ఇటువంటి సందర్భాల్లో... బ్యాంకు నకిలీ కీ లేదా మరొక లాకర్‌ను అందించే అవకాశముంది. లాకర్ కీని కనుగొన లేకపోతే, లాకర్‌ని తెరిచి, దానిలోని వస్తువులను మరో కొత్త లాకర్‌లోకి మారుస్తారు. అదికూడా లాకర్ కీ పోగొట్టుకున్న వారి సమక్షంలోనే ఈ తతంగమంతా నడుస్తుంది. అలాగే మీకు కొత్త కీని అందించాలని బ్యాంక్ నిర్ణయించే అవకాశముంది. అయితే ఇటువంటి వేళ.. లాకర్ మరమ్మతు లేదా దానిని పగలు కొట్టేందుకు అయ్యే వ్యయం.. లాకర్ యజమానులే బాధ్యత వహించ వలసి ఉంటుంది.
Also Read: గుట్కా, పొగాకు తింటే.. ఈ రోగాలు గ్యారంటీ
బ్యాంక్ లాకర్ తెరవడానికి అనుసరించవలసిన నియమాలు!
సాధారణంగా, లాకర్ తెరవాలంటే, కస్టమర్.. బ్యాంకు ప్రతినిధి పర్యవేక్షణలో ప్రక్రియ జరుగుతుంది. బహుశా ఇద్దరు వ్యక్తులు జాయింట్ లాకర్లను (జాయింట్ లాకర్ హోల్డర్లు) కలిగి ఉంటే, ఆ ఇద్దరి సభ్యుల సమక్షంలో లాకర్ తెరుస్తారు. కస్టమర్ అక్కడ లేకుంటే.. వారు లేనప్పుడు లాకర్ తెరవడానికి లిఖితపూర్వక సమ్మతి ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read: గంజాయి చాక్లెట్లు విక్రయం.. పల్నాడులో ఈగల్ డైరెక్టర్ పర్యటన
ఇక లాకర్ తీసుకునే వారు.. బ్యాంక్ విధించే నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అందుకు సమ్మతిస్తూ.. సంతకం చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క సారి లాకర్ హోల్డర్‍పై క్రిమినల్ కేసు నమోదు అవుతుంది. అలాంటి సమయంలో.. నేరానికి సంబంధించిన ఆధారాలు లాకర్ లో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తే.. ఖాతాదారుడు లేకుండానే లాకర్ తెరిచే అవకాశముంది. అటువంటి సందర్భాల్లో బ్యాంక్ అధికారులు.. పోలీసుల సమక్షంలో లాకర్ తెరుస్తారు.
For Business News and Telugu News