Share News

Insurance: ఇన్సూరెన్స్.. క్లెయిమ్ తిరస్కరణ తక్కువగా ఉన్న కంపెనీ ఇదే!

ABN , Publish Date - Dec 24 , 2024 | 02:38 PM

ఇన్సూరెన్స్ సంస్థ తమను అత్యవసర సందర్భాల్లో ఆదుకుంటుందన్న నమ్మకంతో పాలసీదారులు ప్రీమియంలు చెల్లిస్తారు. కానీ, ప్రతి క్లెయిమ్‌‌ను ఇన్సూరెన్స్ సంస్థలు ఆమోదించవు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ కంపెనీల క్లెయిమ్‌‌ల తిరస్కరణ శాతాలను వివరిస్తూ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ (ఐబీఏఐ) తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది.

Insurance:  ఇన్సూరెన్స్.. క్లెయిమ్ తిరస్కరణ తక్కువగా ఉన్న కంపెనీ ఇదే!

ఇంటర్నెట్ డెస్క్: అత్యవసర సందర్భాల్లో ఆర్థిక ఆలంబన కోసం అనేక మంది ఇన్సూరెన్స్ తీసుకుంటారు. చేతిలో సొమ్ము ఖర్చు కాకూడదని జాగ్రత్త పడతారు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ సంస్థ తమను అత్యవసర సందర్భాల్లో ఆదుకుంటుందన్న నమ్మకంతో ప్రీమియంలు కడుతుంటారు. కానీ, పాలసీకొనుగోరుదారులు చేసే ప్రతి క్లెయిమ్‌ను ఇన్సూరెన్స్ సంస్థలు అంగీకరించవు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ కంపెనీల క్లెయిమ్‌‌ల తిరస్కరణ శాతాలను వివరిస్తూ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐబీఏఐ) తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది (Business News).

వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌లకే రీచార్జ్‌ వోచర్లు : ట్రాయ్‌


ఈ నివేదిక ప్రకారం, క్లెయిమ్‌ టూ సెటిల్మెంట్ రేషియో (మొత్తం క్లెయిమ్స్‌లో ఎన్నింటికి సంస్థ డబ్బులు చెల్లించిందనే నిష్ఫత్తి) 2022-23 ఆర్థిక సంవత్సరంలో 86 శాతంగా ఉంది. అంతుకుముందు ఏడాదితో పోలిస్తే ఒక శాతం తగ్గింది. ఇక జనరల్ ఇన్సూరెన్స్ కేటగిరీలో మొత్తం కేసుల్లో క్లెయిమ్ తిరస్కరణ రేటు 6 శాతం పెరిగింది. మోటార్, హెల్త్, ఫైర్, మెరీన్ కార్గో ఇన్సూరెన్సులు జనరల్ ఇన్సూరెన్స్ కేటగిరీలోకి వస్తాయన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థ న్యూ ఇండియా ఎసూరెన్స్‌లో క్లెయిమ్ తిరస్కరణ శాతం అత్యంత తక్కువగా కేవలం 0.2 శాతం ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. తిరస్కరణ రేటు తక్కువగా ఉన్న భారీ ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థల్లో హెడ్‌డీఎఫ్‌సీ ఎర్గో, ఫ్యూచర్ జనరాలీ, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ వంటివి ముందంజలో ఉన్నాయి.

ఏపీ, తెలంగాణ ఎంఎస్‌ఎంఈలపై దృష్టి

ఇన్సూరెన్స్ కంపెనీలు తమ క్లెయిమ్ సెటిల్మెంట్లు, తిరస్కరణల సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాలని ఐఆర్‌డీఏ నిబంధన విధించింది. ఈ సమాచారం ఆధారంగా ఐబీఏఐ తాజా నివేదిక విడుదల చేసింది. పాలసీ హోల్డర్స్ హ్యాండ్‌బుక్ పేరిట విడుదల చేసిన ఈ నివేదికలో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు, భారీ ప్రైవేటు రంగ సంస్థలు, ఇతర ప్రైవేటు జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు, ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలుగా వర్గీకరణ చేసి వివరాలను పొందుపరిచారు. అయితే, హెల్త్ ఇన్సూరెన్స్ కేటగిరీలో కూడా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో (95%) అత్యధికంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థగా న్యూ ఇండియా అసూరెన్స్ నిలిచింది. ఇక స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కేటగిరీలో నెం.1 స్థానంలో ఉన్న ఆదిత్య బిర్లా హెల్త్ 95 శాతం సందర్భాల్లో పాలసీ దారులకు డబ్బు చెల్లించింది (సెటిల్మెంట్ రేషియో). 90 శాతం క్లెయిమ్ - సెటిల్మెంట్ రేషియోతో ఇఫ్కో, బజాజ్ అలయాన్జ్ సంస్థలు భారీ ప్రైవేటు రంగ సంస్థల కేటగిరీలో ముందు వరుసలో ఉన్నాయి.

శ్రేయాస్‌కు మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు


అయితే, హెల్త్‌ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి గ్రూప్ (కార్పొరేట్), వ్యక్తిగత పాలసీలను కలిపి ఈ సెటిల్మెంట్ రేషియోల డాటాను లెక్కించారు. దీనిపై నిపుణులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల్లో ఇచ్చే గ్రూప్ పాలసీల్లో సెటిల్మెంట్ రేషియో ఎప్పటి నుంచో ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వ్యక్తిగత హెల్త్ పాలసీల వివరాలను ప్రత్యేకంగా ఎందుకు వెల్లడించట్లేదని, ఎవరి కోసం ఈ సమాచారంపై గోప్యత పాటిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

నిపుణులు చెప్పేదాని ప్రకారం, పాలసీ తీసుకునే సమయంలో తెలిసో తెలియకో తప్పుడు సమాచారం ఇవ్వడం, లేదా అసంపూర్ణ సమాచారం ఇస్తే క్లెయిమ్స్ తిరస్కరణకు గురవుతాయని చెబుతున్నారు. ఇక, ఇన్సూరెన్స్‌ పాలసీలపై 18 శాతం జీఎస్టీ విధించడంలో ఔచిత్యాన్నీ కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ మౌలిక వైద్య వసతులు దిగదుడుపుగా ఉన్న నేటి తరుణంలో ఈ స్థాయి జీఎస్టీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 24 , 2024 | 02:52 PM