Share News

Critical Care Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ సరే.. క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా?

ABN , Publish Date - Sep 24 , 2024 | 10:36 PM

జీవితాల్ని తలకిందులు చేసే తీవ్ర వ్యాధులు సోకిన సందర్భాల్లో అక్కరకొచ్చే క్రిటికల్ ఇల్‌నెస్‌ ఇన్‌సూరెన్స్‌ను ఆరోగ్యబీమాతోపాటు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జీవితం తలకిందులు కాకుండా ఈ ఇన్సురెన్స్ ఆదుకుంటుందని చెబుతున్నారు.

Critical Care Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ సరే.. క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల అనేక మందిలో తమ ఆరోగ్యంపై స్పృహ పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ (Critical Illness Insurance) కూడా తీసుకుంటున్నారు. అయితే, చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కటే తమకు కావాల్సిన ఆర్థిక భద్రత కల్పిస్తుందని అనుకుంటారు. ఈ ఆలోచన పొరపాటని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వ్యాధులతో జీవితం మొత్తం మారిపోతుందని, అలాంటి సందర్భాల్లో హెల్త్ ఇన్సూరెన్స్‌తో కలగని ఊరట క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్‌తో లభిస్తుందని చెబుతున్నారు (Health).

Financial Fraud: ఆర్థిక మోసాల బారిన పడ్డారా? వెంటనే ఇలా చేయండి!


ఏమిటీ క్రిటికల్ ఇల్‌నెస్ ఇస్సూరెన్స్?

ఉదాహరణకు ఓ వ్యక్తికి క్యాన్సర్ వంటి ప్రాంతక వ్యాధి బారిన పడ్డాడని అనుకుందాం. ఈ వ్యాధితో అతడి జీవితమే మారిపోతుంది. ఆసుపత్రుల ఖర్చులకు తోడు అతడు వృత్తి వ్యాపారాలు కొనసాగించే పరిస్థితి ఉండకపోవచ్చు. కుటుంబానికి అతడి సంపాదనే ఆధారమైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. రోజువారి ఖర్చులకు కూడా డబ్బులు చాలక విలవిల్లాడవచ్చు. ఇలాంటి సందర్భాల్లో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ అండగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Own Vs Rent : సొంత ఇల్లు వర్సెస్ అద్దె ఇల్లు! దీర్ఘకాలంలో ఏది లాభదాయకమంటే..

దీర్ఘకాలిక, లేదా ప్రాణాంతక వ్యాధుల బారినపడ్డప్పుడు ఏకమొత్తంగా క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ మొత్తం అందుతుందని, ఈ మొత్తాన్ని అవసరాలకు తగినట్టు వాడుకుంటూ వ్యాధికి ట్రీట్‌మెంటు తీసుకోవచ్చని చెబుతున్నారు. ఆదాయం గురించి చింత లేకుండా వ్యాధికి తగినట్టు జీవినశైలిలో మార్పులు చేసుకోవచ్చని చెబుతున్నారు. వృత్తి వ్యాపారాలను నిశ్చితంగా పక్కనపెట్టి ఆరోగ్యంపై దృష్టిపెట్టొచ్చని చెబుతున్నారు.

Pan Card: మీ వద్ద రెండు పాన్ కార్డులు ఉన్నాయా? రిస్క్‌లో పడ్డారుగా!


స్ట్రోక్, క్యాన్సర్, హృద్రోగాలు వంటివి తలెత్తినప్పుడు ఈ ఇన్సూరెన్స్ మొత్తం కచ్చితంగా ఆదుకుంటుందనేది నిపుణుల అభిప్రాయం. హెల్త్ ఇన్సూరెన్స్‌లో కవర్ కాని అనేక అవసరాలు ఈ బీమాతో తీరుతాయి. రోగాలతో కలిగే దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఆర్థిక అవసరాలన్నీ తీర్చుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది క్రిటికల్ ఇల్‌నెస్‌ ఇన్సూరెన్స్‌ను సాధారణ ఆరోగ్య బీమాకు యాడాన్‌గా తీసుకుంటున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్‌ ఆసుపత్రి బిల్లులు చెల్లించడంలో అక్కరకు వస్తే, ఈ ఇన్సూరెన్స్‌తో అన్ని రకాల ఆర్థిక అడ్డంకుల నుంచీ గట్టెక్కొచ్చు.

ఎవరు ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే..

కుటుంబంలో దీర్ఘకాలిక రోగాల చరిత్ర ఉన్న వారు ఈ ఇన్సురెన్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కుటుంబంలో ఒకేఒక సంపాదన పరుడిగా ఉన్న వారు కూడా ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

Personal Finance: మిడిల్ క్లాస్ జీవులు కచ్చితంగా పాటించాల్సిన 10 ఆర్థిక సూత్రాలు!

Read Latest and Business News

Updated Date - Sep 24 , 2024 | 10:48 PM