Xiaomi: లాంచ్‌కు ముందే SU7 ఎలక్ట్రిక్ కార్ ధర లీక్.. ఎంతో తెలుసా?
ABN , Publish Date - Mar 25 , 2024 | 01:42 PM
చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ కారు SU7 మోడల్ ధరలను గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతోపాటు కొనుగోళ్ల కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే కారు ధర ఎంత ఉంటుందో కంపెనీ సీఈఓ లీక్ చేశారు. ఆ రేటు, కారు సౌకర్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ కార్ SU7 మోడల్ ధరలను గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతోపాటు కొనుగోళ్ల కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే కార్ ధర 5 లక్షల యువాన్ల (దాదాపు రూ. 58 లక్షలు) లోపే ఉంటుందని కంపెనీ సీఈఓ లీ జున్(CEO Lei Jun) తెలిపారు. ఇది చాలా అందంగా కనిపించడంతోపాటు డ్రైవింగ్ చేయడానికి సులభంగా, స్మార్ట్‌గా ఉంటుందని ఆయన తెలిపారు.
ఇది టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంటే ఎక్కువ యాక్సిలరేషన్ ఇస్తుందని లీ చెప్పారు. అయితే డిసెంబర్‌లో ఈ కారును ప్రకటించినప్పటి నుంచి దీని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు ఇది ప్రపంచంలోని టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల తయారీదారులలో ఒకటిగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. చైనా(china)లోని షియోమీ షోరూమ్‌లో ఈ కారు ప్రదర్శన కూడా ప్రారంభమైంది.
ఇది నాలుగు డోర్ల ఎలక్ట్రిక్ సెడాన్ కార్. దీని పొడవు 4,997 mm, వెడల్పు 1,963 mm, ఎత్తు 1,455 mm. EV 3,000 mm వీల్‌బేస్‌తో వస్తుంది. బ్యాటరీ శక్తి నిల్వ సామర్థ్యాన్ని బట్టి SU7 రెండు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. ఒకటి ఒక్కసారి ఛార్జ్‌పై 668 కి.మీ. (415 మైళ్ల) వరకు డ్రైవింగ్ రేంజ్, మరొకటి 800 కి.మీ.ల రేంజ్‌తో వస్తుంది. ఎంట్రీ లెవల్ వేరియంట్ 73.6 kWh బ్యాటరీ ప్యాక్, టాప్ ఆఫ్ ది లైన్ వేరియంట్ 101 kWh బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది.
ఇక దీని సౌకర్యాల విషయానికి వస్తే దీని మధ్యలో పెద్ద మల్టీమీడియా స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ స్క్రీన్ దిగువన, 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వైర్‌లెస్ ఛార్జింగ్ జోన్, స్టార్ట్ స్టాప్ బటన్, ఎయిర్ కండిషనింగ్, ఫ్యాన్ స్పీడ్ సస్పెన్షన్, కప్ హోల్డర్ వంటి సెట్టింగ్‌ల కోసం ఫిజికల్ బటన్లు ఉన్నాయి. Xiaomi SU7 వెనుక సీటులో ఉన్నవారి కోసం రెండు ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లను కూడా కలిగి ఉంది. వెనుక ప్రయాణీకుల కోసం స్క్రీన్‌లు, టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే(display) నుంచి స్వతంత్రంగా కనిపిస్తాయి. అంతేకాదు 2025లో 1,200 కిమీ పరిధితో పెద్ద 150 kWh బ్యాటరీ ప్యాక్‌తో V8 కొత్త వెర్షన్‌ను కూడా పరిచయం చేస్తామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: చిన్న నగరాల్లో ప్రీమియం కార్లకు డిమాండ్