Raghuram Rajan: యువ భారతీయులది విరాట్ కోహ్లీ మనస్తత్వం.. అందుకే వారు భారత్‌ను వీడుతున్నారు.. రఘురామ్ రాజన్
ABN , Publish Date - Apr 17 , 2024 | 03:22 PM
భారతదేశానికి చెందిన యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నారని, కానీ వారు భారత్‌లో ఉండడానికి మాత్రం ఇష్టపడడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (Raghuram Rajan) అన్నారు.
భారతదేశానికి చెందిన యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నారని, కానీ వారు భారత్‌లో ఉండడానికి మాత్రం ఇష్టపడడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (Raghuram Rajan) అన్నారు. యంగ్ ఇండియాది విరాట్ కోహ్లీ మనస్తత్వం (Virat Kohli mentality) అని, సవాళ్లను దీటుగా ఎదుర్కొంటారని, రెండో స్థానంలో ఉండేందుకు ఇష్టపడరని పేర్కొన్నారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ``మేకింగ్ ఇండియా యాన్ అడ్వాన్స్ ఎకానమీ బై 2047`` అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు రఘరామ్ రాజన్ హాజరయ్యారు.
డెమోగ్రాఫిక్ డెవిడెండ్ కారణంగా కలిగే ప్రయోజనాలను భారత్ పొందలేకపోతోందని, ఈ విషయంలో చైనా, కొరియా ఎక్కువ ప్రతిఫలాన్ని పొందాయని, యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రాజన్ అభిప్రాయపడ్డారు. దేశం మొత్తం జనాభాలో ఏ పనీ చేయని వారితో పోలిస్తే పని చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడాన్ని డెమోగ్రాఫిక్ డెవిడెండ్ అంటారు. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు కృషి చేసి, ఉద్యోగాల కల్పన చేస్తేనే డెమోగ్రాఫిక్ డెవిడెండ్ ఫలితం అందుతుందని రాజన్ తెలిపారు.
భారత్‌కు చెందిన చాలా మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సింగపూర్‌కు, సిలికాన్ వ్యాలీకి తరలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో దశాబ్దాలుగా నిరుద్యోగ సమస్య పెరుగుతోందని, పీహెచ్‌డీలు చేసిన వారు కూడా రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ప్యూన్ ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నించకపోతే అది భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
3 రోజుల్లో రూ.8 లక్షల కోట్లు ఫట్
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..