YV Reddy: మన్మోహన్ సింగ్‌కు మార్గదర్శకుడు మన వైవీ రెడ్డి
ABN , Publish Date - Dec 29 , 2024 | 06:59 AM
మన్మోహన్ సింగ్ మంత్రిగా పదవి భాద్యతలు స్వీకరించి ఆర్థిక మంత్రిత్వ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొవచ్చిన వారిలో మన్మోహన్ సింగ్‌తో పాటు వైవీ రెడ్డి కూడా ఒకరనేది కొద్ది మందికి మాత్రమే తెలుసు.
జిల్లా కలెక్టర్ నుండి అంతర్జాతీయ ఆర్ధిక సంస్ధల వరకు
స్మగ్లర్ల బంగారం తాకట్టు పెట్టి దేశాన్ని కాపాడింది ఆయనే
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: విదేశీ మారక నిల్వల విషయంలో దేశం 1990ల్లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యంది. మన విదేశీ మారకం అక్రమంగా బంగారాన్ని దేశానికి తీసుకోరావడంలో వెచ్చించారు. తమ ప్రభుత్వం ప్రతి ప్రవాసీ భారతీయుడు ఇక నుండి తన వెంట 5 కిలోల బంగారాన్ని 15 శాతం వరకు కస్టం పన్ను చెల్లించి తీసుకోరావడానికి అనుమతిస్తున్నామని తన 1992-93 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మన్మోహాన్ సింగ్ ప్రకటించడంతో యావత్తు దేశంతో పాటు ప్రపంచం అశ్చర్యపోయింది (Business News).
దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసే దిశగా భారతదేశం చేసిన ఈ ప్రకటన చారిత్ర్మాకమైంది. అప్పటికే గత ప్రభుత్వం బంగారం ద్వారా విదేశాల నుండి కొంత వరకు నిధులు సమీకరించుకొన్నా అది తాత్కలికమని, సరళీకృత విధానంలో బంగారం దిగుమతి విధానాన్ని అనుమతిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు.
గల్ఫ్ దేశాల నుండి అక్రమంగా తీసుకువచ్చే బంగారాన్ని కస్టం అధికారులు అప్పుడప్పుడు స్వాధీనం చేసుకోంటారు. ఈ రకంగా కేంద్రం వద్ద నిల్వ ఉన్న బంగారం గురించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో అప్పట్లో విదేశీ చెల్లింపుల విభాగం సంయుక్త కార్యదర్శిగా పని చేసిన తెలుగు ఐ.ఎ.యస్ అధికారి అయిన వై. వి. రెడ్డి గుర్తించారు. ఆర్థిక రంగంలో ఆయనకు ఉన్న అపార అనుభవంతో ఆ తర్వాత ఆయన రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా కూడా పని చేసారు.
CM Chandrababu : ఏఐతో వైద్య సేవలు
సద్దాం హుస్సేన్ కువైత్ దురాక్రమణతో మొదలయిన గల్ఫ్ యుద్ధంతో అనూహ్యంగా పెరిగిన చమురు ధరలు, మిఖైల్ గోర్బోచెవ్ సంస్కరణల వలన సోవియట్ దిగుమతులను రూపాయిల్లో కాకుండా విదేశీ మారకంలో చెల్లించవల్సి రావడం, సంకీర్ణ ప్రభుత్వాలు, రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో దేశంలో చమురు దిగుమతులకు అవసరమైన విదేశీ మారకం సన్నగిలి కేవలం వారం రోజుల వినియోగానికి సరిపడే విదేశీ మారకం నిల్వలు ఉన్న దశ అది. ఆ పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ మంత్రిగా పదవి భాద్యతలు స్వీకరించి ఆర్థిక మంత్రిత్వ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొవచ్చిన వారిలో మన్మోహన్ సింగ్‌తో పాటు వైవీ రెడ్డి కూడా ఒకరనేది కొద్ది మందికి మాత్రమే తెలుసు.
SC Categorization : వర్గీకరణ ఏకసభ్య కమిషన్‌కు 377 వినతులు
వాస్తవానికి మన్మోహాన్ సింగ్ కంటే ముందుగా, ఆర్థిక మంత్రిగా పని చేసిన యశ్వంత్ సిన్హాకు కూడా బంగారం అమ్మి చమురు దిగుమతులకు డబ్బులు సర్దవచ్చని ఆయన సూచించారు. అయితే, బంగారం అమ్మితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, దానికి బదులుగా తాకట్టుపెట్టి అప్పు తీసుకోరావాలని యశ్వంత్ సిన్హా సూచించడంతో 20 టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్‌లో తాకట్టు పెట్టారు. ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ మరో 47 టన్నుల బంగారాన్ని బ్రిటన్‌లో తాకట్టుపెట్టి అప్పులు తీసుకోవచ్చారు. అనంతరం దేశంలో క్రమేణా ఆర్థిక సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఈ ఇద్దరు మంత్రులు కూడా బంగారాన్ని తాకట్టు పెట్టి అవసరమైన నిధులను తీసుకోవరావడాన్ని ప్రతిపాదించి దాన్ని పూర్తిగా అమలు చేసిన అధికారి వై.వి.రెడ్డి. అధికారిక బాధ్యతల నుండి వైదొలగిన అనంతరం హైదరాబాద్‌లో ఒక సందర్భంగా 1991లో మొదలు దేశాన్ని ఆదుకొంది స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకోన్న బంగారమేనని వైవి రెడ్డి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
కడప జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన యాగ వేణుగోపాల్ రెడ్డి .. వైవీ రెడ్డిగా అంతర్జాతీయంగా ఆర్థిక సంస్కరణలలో నిపుణుడిగా పేరొందారు. గల్ఫ్ లోని బహ్రెయిన్ ప్రభుత్వంతో పాటు చైనాతో సహా అనేక దేశాలకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి ఆర్థిక సంస్కరణల విభాగాలలో వైవి రెడ్డి పని చేసారు. ఐఏయస్ అధికారిగా నల్గొండ, గుంటూరుతో సహా అనేక జిల్లాలలో కలెక్టర్‌గా పని చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖకు వచ్చారు.
Read More Business News and Latest Telugu News