Home » Manmohan Singh
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి కే నట్వర్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుగ్రామ్‌లో గల మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నట్వర్ సింగ్ చనిపోయారని కుటుంబ సభ్యులు మీడియాకు వివరించారు. మన్మోహన్ సింగ్ హయాంలో నట్వర్ సింగ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.
ఇండియా 'అసాధారణ ప్రయాణం' వెనుక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, 'హ్యాట్రిక్' ప్రధాని నరేంద్ర మోదీ గణనీయమైన కృషి చేశారని భారతదేశ దిగ్గజ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ కొనియాడారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అత్యంత దుర్మార్గమైన రీతిలో విద్వేష ప్రసంగాలు చేశారని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ తీవ్రవ్యాఖ్యలు చేశారు.
పురాతన జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఒక శకం ముగిసింది. మాజీ ప్రధాని, ఎంపీ మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. ఏప్రిల్ 3తో పార్లమెంటులో మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. ఈ సందర్భంగా యావత్తు దేశం ఆయన సేవలను గుర్తు చేసుకుంటోంది.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 లోక్‌సభ స్థానలకుపైగా గెలుచుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు ( Lok Sabha Elections ) ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా పని చేసిన వారు, పని చేస్తున్న వారు టిక్కెట్లు దక్కించుకుని విజయం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh)ను ప్రశంసించారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా ప్రధాని సభలో ప్రసంగించారు.
భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. మన్మోహన్ సింగ్ మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వానికి మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అనూహ్య మద్ధతిచ్చారు. శాంతిని ఆకాంక్షిస్తూనే దేశ సార్వభౌమత్వం, ఆర్థిక ఆసక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం సరైదేనని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఔను... నిజం! నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా(special status) రాకుండా అడ్డు చక్రం వేసిన ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ(Rajat Bhargava)! ఒక్కసారి కాదు.. ఆయన ఐదుసార్లు ‘సహాయ నిరాకరణ’ చేశారు. సీమాంధ్ర నేతలు నాడు ఢిల్లీలో ఏం జరుగుతోందో తెలుసుకోలేదు.