Share News

జెన్‌ టెక్నాలజీస్‌.. ఏఐ ఆధారిత రోబో ‘ప్రహస్థ’

ABN , Publish Date - Jul 16 , 2024 | 05:12 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే జెన్‌ టెక్నాలజీస్‌ మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. అంతర్జాతీయ, దేశీయ రక్షణ మార్కెట్‌ కోసం ప్రత్యేకంగా ఈ ఉత్పత్తులను...

జెన్‌ టెక్నాలజీస్‌.. ఏఐ ఆధారిత రోబో ‘ప్రహస్థ’

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే జెన్‌ టెక్నాలజీస్‌ మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. అంతర్జాతీయ, దేశీయ రక్షణ మార్కెట్‌ కోసం ప్రత్యేకంగా ఈ ఉత్పత్తులను రూపొందించింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల రక్షణ దళాలకు ట్రైనిం గ్‌ సొల్యూషన్స్‌, యాంటీ డ్రోన్‌ టెక్నాలజీలను అందిస్తున్న ఈ సంస్థ తాజాగా కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే ‘ప్రహస్థ’ అనే రోబోను మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ అనుబంధ సంస్థ ఏఐ టూరింగ్‌ టెక్నాలజీస్‌ భాగస్వామ్యంతో కంపెనీ ఈ రోబోను అభివృద్ధి చేసింది. దీనికి తోడు యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ కెమెరా ‘హ్యాక్‌ఐ’, రిమోట్‌ కంట్రోల్డ్‌ వెపన్‌ స్టేషన్‌ ‘బార్బారిక్‌-యూఆర్‌సీడబ్ల్యుఎస్‌, సైనికులను తీసుకువెళ్లే వాహనాలు, తేలికపాటి పోరాట వాహనాలు (ఎల్‌సీవీ), బోట్లకు అవసరమైన ‘స్థిర్‌ స్టాబ్‌ 640’ అనే రగ్గ్‌డ్‌ స్టెబిలైజ్‌డ్‌ సైట్‌ డిజైన్డ్‌ పరికరాలను మార్కెట్లోకి విడుదల చేసింది.


ఇందులో ప్రహస్థ రోబో లిడార్‌ (లైట్‌ డిటెక్షన్‌ అండ్‌ రేంజింగ్‌)తో పనిచేస్తుంది. ఈ స్వయం చాలిత నాలుగు కాళ్ల రోబో ద్వారా రియల్‌ టైమ్‌ 3డీ టెరైన్‌ మ్యాపింగ్‌ చేసి మిషన్‌ ప్లానింగ్‌, నేవిగేషన్‌, త్రెట్‌ అసె్‌సమెంట్‌ చేయవచ్చని తెలిపింది.

Updated Date - Jul 16 , 2024 | 05:12 AM