ముడి చమురుపై జీరో విండ్‌ఫాల్ ట్యాక్స్
ABN , Publish Date - Sep 18 , 2024 | 01:17 AM
దేశంలో ఉత్పత్తి చేసే ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ప్రభుత్వం జీరోకి కుదించింది. బుధవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు కంపెనీల భారీ లాభాలకు...
న్యూఢిల్లీ: దేశంలో ఉత్పత్తి చేసే ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ప్రభుత్వం జీరోకి కుదించింది. బుధవారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు కంపెనీల భారీ లాభాలకు చెక్‌పెట్టేందుకు 2022 జూలైలో ప్రభుత్వం ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఎస్‌ఏఈడీ) పేరుతో ఈ ట్యాక్స్‌ను ప్రవేశ పెట్టింది. ప్రతి 15 రోజులకు ఒకసారి, అంతకు ముందు రెండు వారాల సగటు ధర ఆధారంగా ప్రభుత్వం ఈ ట్యాక్స్‌ను సవరిస్తుంటుంది. గత నెల 31 తర్వాత ప్రభుత్వం ఈ ట్యాక్స్‌ను సవరించడం ఇదే మొదటిసారి. అప్పట్లో దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి టన్ను ముడి చమురుపై రూ.1,850 చొప్పున విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా నిర్ణయించారు. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎ్‌ఫ)పై విధించే విండ్‌ఫాల్ ట్యాక్స్‌నీ జీరో వద్దే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.