Share News

గోవుల తరలిస్తున్న డీసీఎం, లారీలు పట్టివేత

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:46 AM

మిర్యాలగూడ అర్బన్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): డీసీఎం, లారీల్లో హైదరాబాద్‌కు అక్రమంగా తలిస్తున్న గోవులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

 గోవుల తరలిస్తున్న డీసీఎం, లారీలు పట్టివేత

మిర్యాలగూడ అర్బన్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): డీసీఎం, లారీల్లో హైదరాబాద్‌కు అక్రమంగా తలిస్తున్న గోవులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం అద్దంకి- నార్కట్‌పల్లి ప్రధాన రహ దారిపై వాహనాలే తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వన్‌టౌన్‌ పరిధిలో-2, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌పరిధిలో-1, మాడ్గుపల్లి పోలీస్‌ స్టేషన్‌పరిధిలో-2 ఆంధ్రప్రదేశ్‌లోని విజయ ునగరం నుంచి డీసీఎం, లారీల్లో హైదరాబాద్‌కు వెళ్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. పట్టుబడ్డ ఐదువాహనాల్లో సుమారు 269 వరకు గోవులున్నట్లు గుర్తించా మన్నారు. డీసీఎం, లారీల్లో సామర్థ్యాన్ని మించి గోవులను ఎక్కించడంతో ఊపిరాడక 6 గోవులు మృతి చెందాయి. మిగతా గోవుల సంరక్షణార్థం అందుబాటులో ఉన్న గోశాలకు తరలి స్తు న్నట్లు తెలిపారు. ఐదుగురు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తు మన్నారు. పట్టుబడ్డ గోవులను ఎవరు కొనుగోలు చేసి, ఎందు కోసం తరలిస్తున్నారనే దానిపై లోతైన విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు.

చౌటుప్పల్‌ రూరల్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా తరలిస్తున్న 70గోవులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. సీఐ మన్మదకుమార్‌ తెలిపి న వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి డీసీఎంలో 70గోవులను విజయవాడ నుంచి హైదరాబాద్‌ బహదూర్‌ కబేళాకు తరలిస్తుండగా పోలీసులు చౌటుప్పల్‌ బస్‌ స్టేషన్‌ సమీపంలో పట్టుకున్నారు. పట్టుబడ్డ ఆవులను జియాగూడ గోశాలకు తరలించారు. కర్ణాటకకు చెందిన ఎండీ ఖాజా, హరిహర అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Nov 14 , 2024 | 12:47 AM