సినీనటుడు రఘుబాబు అరెస్టు.. విడుదల
ABN , Publish Date - Apr 20 , 2024 | 07:47 AM
నల్లగొండ పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్ నేత సంధినేని జనార్ధన్‌రావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేసులో సినీనటుడు రఘుబాబును శుక్రవారం స్థానిక టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నల్లగొండ టౌన్, ఏప్రిల్ 19 : నల్లగొండ పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్ నేత సంధినేని జనార్ధన్‌రావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేసులో సినీనటుడు రఘుబాబును శుక్రవారం స్థానిక టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను రిమాండ్‌కు తరలించారు. రఘుబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 17న బీఆర్‌ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌రావు నార్కట్‌పల్లి-అద్దంకి బైపాస్ వద్ద రోడ్డు దాటుతుండగా, వెనుక వేగంగా వస్తున్న సినీనటుడు రఘుబాబు కారు ఢీకొనడంతో మృతి చెందారు. అప్పటికప్పుడు పోలీసులు రఘుబాబును అదుపులోకి తీసుకున్నా సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. తాజాగా శుక్రవారం ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరు చేసినట్టు టూటౌన్ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.