Share News

Crime News: హల్దీ వేడుకల్లో ఫ్యామిలీ.. సీక్రెట్‌గా పనికానిచ్చేసిన దొంగలు.. పెళ్లింట సినిమా సీన్‌ను తలపించే చోరీ

ABN , Publish Date - Nov 19 , 2024 | 02:25 PM

పెళ్లింట జరిగిన భారీ చోరీ రంగారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బంధువులు, సన్నిహితులతో ఆ ఇల్లంతా సందడిగా ఉంది. ఇంట్లో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. వేసిన బీరువా వేసినట్టే ఉంది. తీరా చూస్తే చడీ చప్పుడు లేకుండా భారీ ఎత్తున నగదు, బంగారం చోరీకి గురైంది. ఇంత జరుగుతున్నా ఆ ఇంట్లో ఎవరికీ దీనిపై అనుమానం రాకపోవడం గమనార్హం.

Crime News: హల్దీ వేడుకల్లో ఫ్యామిలీ.. సీక్రెట్‌గా పనికానిచ్చేసిన దొంగలు.. పెళ్లింట సినిమా సీన్‌ను తలపించే చోరీ
Theft

శంకర్ పల్లి: కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని భావించిన ఓ తండ్రి గుండె బద్దలైంది. రెండ్రోజుల్లో పెళ్లి ఉందనగా పెళ్లింట భారీ చోరీ జరిగింది. హల్దీ వేడుకల్లో మునిగిపోయిన ఆ కుటుంబానికి ఊహించని షాక్ ఎదురైంది. బీర్వా తెరిచి చూడగా.. ఇంట్లో దాచిన 133 తులాల బంగారం, 80తులాల వెండి, రూ.2.50 లక్షల నగదు కనిపించలేదు. దీంతో వారంతా లబోదిబోమంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో చోరీ జరిగినా ఇంట్లో ఎవరూ ఆ విషయం గుర్తించకపోవడం గమనార్హం.


రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. శంకర్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పార్శి రాధా బాలకృష్ణ కూతురు వివాహం ఈ నెల 20న జరిపేందుకు నిశ్చయించారు. అందుకోసం భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు ఖరీదు చేశారు. ఆదివారం రోజున హల్దీ వేడుకలు నిర్వహించడంతో ఇళ్లంతా హడావుడిగా ఉంది. నగలు పెట్టేందుకు బీర్వా తెరిచి చూడగా అందులో దాచిన నగలు కనిపించలేదు. దీంతో బాధిత కుటుంబం అర్ధరాత్రి శంకర్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత కుటుంబం ఫిర్యాదు ఆధారంగా క్లూస్ టీంతో ఆధారాలు సేకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. నగలు ఉన్న గదిలోకి ఎవరు వెళ్లారు.. ఇది ఇంటి దొంగల పనేనా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Viral Video: పోయే కాలం అంటే ఇదే.. జస్ట్ మిస్.. లేదంటే...


Updated Date - Nov 19 , 2024 | 02:27 PM