Share News

Chandra Mangal Yuti: మరికొద్ది రోజుల్లో ఈ మూడు రాశుల వారికి బంగారు యోగం..

ABN , Publish Date - Oct 16 , 2024 | 04:29 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం కుజుడు.. కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ మరునాడే అంటే అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 6.49 గంటలకు చంద్రుడు సైతం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కర్కాటక రాశిలో అంగారకుడు, చంద్రుడు కలిసి ఉండటం వల్ల మహాలక్ష్మి యోగం కలగనుంది. ఈ యోగం మూడు రాశుల వారికి శుభప్రదం అవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.

Chandra Mangal Yuti: మరికొద్ది రోజుల్లో ఈ మూడు రాశుల వారికి బంగారు యోగం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు స్థిరమైన వేగంతో కదులుతుంటాయి. ఈ గ్రహ కదలికలు వల్ల పలు రాశుల వారికి వివిధ రకాల యోగాలు ఏర్పడతాయి. అయితే అంగారక గ్రహం త్వరలో మరో రాశిలోకి ప్రవేశించనుంది. ఈ రాశి మార్పు కారణంగా మహాలక్ష్మి అనే చాలా శుభ యోగాన్ని సృష్టిస్తుంది. ఈ యోగం వల్ల మూడు రాశుల వారు అద్బుత ఫలితాలు అందుకోనున్నారు.


అంగారకుడు, బృహస్పతి కలయిక:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం కుజుడు.. కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ మరునాడే అంటే అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 6.49 గంటలకు చంద్రుడు సైతం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కర్కాటక రాశిలో అంగారకుడు, చంద్రుడు కలిసి ఉండటం వల్ల మహాలక్ష్మి యోగం కలగనుంది. ఈ యోగం మూడు రాశుల వారికి శుభప్రదం అవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఆయా రాశులు ఏమంటే..


1) వృషభ రాశి:

ఈ రాశి వారికి వృషభ మహాలక్ష్మి యోగం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఏదైనా పని చాలా కాలంగా నిలిచిపోయి ఉంటే.. ఈ సమయంలో పూర్తి చేయవచ్చు. అలాగే ఈ రాశి వారు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. మీరు మీ ఉద్యోగానికి సంబంధించి విహారయాత్రకు సైతం వెళ్లవలసి ఉండే అవకాశముంది. అలాగే ఉద్యోగం మారాలనే ఆలోచన కూడా రావచ్చు. ఇక వ్యాపారం చేసే వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయంగా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ సమయంలో అదృష్టం సైతం మీకు పూర్తి మద్దతుగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. నగదు ఆదా చేయడంలో కూడా సంపూర్ణ విజయం సాధించే అవకాశాలున్నాయి.


2) కర్కాటకం:

ఈ రాశి వారు తమ కెరీర్‌లో కొత్త అవకాశాలు పొందవచ్చు. ఉద్యోగస్తులకు జీతం పెరగడంతోపాటు పదోన్నతి సైతం పొందే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టేందుకు కూడా ఇది అత్యంత అనుకూల సమయంగా ఉంది. ఇక వైవాహిక జీవితంలో దంపతుల మధ్య సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. భాగస్వామితో కలిసి మంచి సమయం గడుపుతారు. మీరు నూతన కార్యాలను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే.. అందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. తద్వారా గొప్ప ప్రయోజనాలను పొందే అవకాశాలు సైతం పుష్కలంగా ఉన్నాయి.


3) కన్య రాశి:

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కష్టానికి తగిన ఫలాన్ని ఈ రాశి వారు అందుకుంటారు. నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు.. తాము కోరుకున్న ఉద్యోగాన్ని పొందేందుకు అత్యంత అనుకూలమైన కాలం. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వృత్తిలో ఎదుగుదల ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సైతం సాధిస్తారు.

For More Devotional News And Telugu News...

Updated Date - Oct 16 , 2024 | 04:29 PM