Dev Deepawali 2024: దేవ్ దీపావళి ఎప్పుడు నవంబర్ 15 లేక 16
ABN , Publish Date - Nov 10 , 2024 | 10:54 AM
హిందువులు సంప్రదాయంగా జరుపుకునే పండగలలో ‘దేవ్ దీపావళి’ ఒకటి. కార్తీక పూర్ణిమ రోజున ఈ పండగను జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం.. కార్తీక్ పౌర్ణమి త్రిపురాసురుడు అనే రాక్షసుడిని శివుడు అంతమొందించాడు.
హిందువులు సంప్రదాయంగా జరుపుకునే పండగలలో ‘దేవ్ దీపావళి’ ఒకటి. కార్తీక పౌర్ణమి రోజున ఈ పండగను జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం.. కార్తీక్ పౌర్ణమి రోజున త్రిపురాసురుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించాడు. రాక్షసులపై శివుడు సాధించిన విజయానికి గుర్తుగా ‘దేవ్ దీపావళి’ పర్వదినాన్ని జరుపుకుంటారు. అంతేకాదు ఈ పండగ రోజున శివుడి కుమారుడు ‘కార్తీక్’ జన్మదినం కావడం మరో విశేషం. హిందూ దేవతలు స్వర్గంలో ఈ పండగను జరుపుకుంటారని విశ్వసిస్తారు.
ఈ ఏడాది దేవ్ దీపావళి ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం.. కార్తీక పౌర్ణమి నవంబర్ 15 శుక్రవారం ఉదయం 6.19 నుంచి నవంబర్ 16 మధ్యాహ్నం 2.57 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఉదయ్ తిథి ప్రకారం కార్తీక పౌర్ణమి నవంబర్ 15న వచ్చిందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అయితే ఈసారి దేవ్ దీపావళి భద్ర ప్రభావం ఉందని జ్యోతిష నిపుణులు చెతున్నారు. భద్ర ఉదయం 6.43 నుంచి సాయంత్రం 4.37 గంటల వరకు, రాహుకాలం ఉదయం 10.44 నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు ఉంటాయని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహుకాలం, భద్ర కాలం శుభకార్యాలకు మంగళకరమైనవి కావు.
అయితే దేవ్ దీపావళి ప్రదోష కాల ముహూర్తం నవంబర్ 15న సాయంత్రం 05:10 నుంచి 07:47 వరకు ఉంటుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. పూజకు మొత్తం 2.37 నిమిషాల సమయం అనుకూలంగా ఉందని చెబుతున్నారు. కాగా దేవ్ దీపావళి (కార్తీక్ పౌర్ణమి) నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. వీలైతే నది స్నానం ఆచరించాలి. ఆ తర్వాత సంప్రదాయబద్దంగా పూజా కార్యక్రమాలు, ఆహార నియమాలు పాటించాలి.