Share News

Dussehra Celebration: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ముహుర్తం ఖరారు..

ABN , Publish Date - Aug 28 , 2024 | 05:36 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ముహుర్తం ఖరారు చేశారు. పది రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే వేడుకల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరిస్తారు.

Dussehra Celebration: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ముహుర్తం ఖరారు..
indrakeeladri

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ముహుర్తం ఖరారు చేశారు. పది రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే వేడుకల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరిస్తారు. మొదటిరోజైన అక్టోబర్ 3వ తేదీన అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. 4వ తేదీన గాయత్రీదేవిగా, 5వ తేదీన అన్నపూర్ణ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. 6వ తేదీన లలితా త్రిపుర సుందరీదేవిగా, 7వ తేదీన మహాచండీ అలంకారంలో, 8వ తేదీన మహాలక్ష్మీ దేవి గా దర్శనమిస్తారు. 9వ తేదీన సరస్వతి దేవిగా దర్శనమిస్తారు. 10వ తేదీన దుర్గాదేవిగా, 11వ తేదీన న మహిషాసురమర్దినిగా, 12వ తేదీన రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు.

AP Politics: మోపిదేవి బాటలో మరో ఎంపీ..ఎవరతను


ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు..

భక్తులకు ఇబ్బంది లేకుండా దసరా ఉత్సవాల కోసం ఆలయంలో పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దేవీ శరన్నవరాత్రులకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి రానున్నారు. సగటున ప్రతి రోజు లక్షమంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలనక్షత్రం రోజు సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. అక్టోబర్ 9వ తేదీన సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణ కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. క్యూ లైన్ల ఏర్పాటుతో పాటు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

JC Asmith Reddy: కొందరు పోలీసుల తీరులో మార్పు రాలేదు..


ప్రత్యేక దర్శనాల రద్దు..

దసరా ఉత్సవాల నేపథ్యంలో 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తారు. గర్భగుడి దర్శనానికి అనుమతించరు. కేవలం ప్రోట్రోకాల్ కలిగిన వ్యక్తులకు మాత్రమే ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. సామాన్య భక్తులకు లిఫ్ట్ సౌకర్యం అందుబాటులో ఉండదు. కేవలం వృద్ధులు, ఆలయ సిబ్బందికి లిఫ్ట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కొండకింద నుంచి పైకి క్యూలైన్‌లో వెళ్లాల్సి ఉంటుంది. బస్సు మార్గంలో కొండపైకి సగం వరకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి నడక ద్వారా క్యూలైన్‌లోకి ప్రవేశించాలి. వీఐపీ వాహనాలను సైతం కొంతవరకు అనుమతిస్తారు. ప్రసాదం కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లను చేయనున్నారు.


AP Minister: మంత్రిగా తొలిసారి విశాఖకు నారా లోకేశ్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 28 , 2024 | 05:51 PM