Share News

Vinayaka Chavithi: ఏకవింశతి పూజ అంటే ఏమిటి.. 21 పత్రాల వెనుకనున్న రహస్యం

ABN , Publish Date - Sep 06 , 2024 | 05:03 PM

Vinayaka Chavithi Special 2024: చవితి పర్వదినం సందర్బంగా 21 రకాల పత్రాలతో గణపతిని పూజిస్తారు. ఇలా 21 పత్రాలతో పూజించడాన్ని ఏకవింశతి పూజ అని పేర్కొంటారు. వినాయకుడిని ఇలా మతపరంగా పూజించినా.. శాస్త్రపరంగా దీని వెనుక అర్థం పరమార్థం దాగి ఉందని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు.

Vinayaka Chavithi: ఏకవింశతి పూజ అంటే ఏమిటి.. 21 పత్రాల వెనుకనున్న రహస్యం

దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు మరికొన్ని గంటల్లో ఘనంగా ప్రారంభం కానున్నాయి. అలాంటి వేళ.. సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడు.. భక్తుల నుంచి పూజలందుకోనున్నారు. ఈ పూజలో పూలు, పళ్లతోపాటు రకరకాల పత్రాలను సైతం వినియోగిస్తారు. చవితి పర్వదినం సందర్బంగా 21 రకాల పత్రాలతో గణపతిని పూజిస్తారు. ఇలా 21 పత్రాలతో పూజించడాన్ని ఏకవింశతి పూజ అని పేర్కొంటారు. వినాయకుడిని ఇలా మతపరంగా పూజించినా.. శాస్త్రపరంగా దీని వెనుక అర్థం పరమార్థం దాగి ఉందని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. మనిషికి ప్రకృతికి అవినాభావ సంబంధముంది. అలాంటి పరిస్థితుల్లో ప్రకృతిలోని అమూల్యమైన ఔషధ సంపదకు సంబంధించిన జ్జానాన్ని తర్వాతి తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ ఏకవింశతి పూజను గణపతిని ఆరాధించే క్రమంలో చేస్తారని వారు సోదాహరణగా వివరిస్తున్నారు.


vinayaka-111.jpg

1)

అగస్త్య పత్ర

ఆగస్త్య పత్రాలు కంటి సంబంధిత సమస్యలకు ప్రభావవంతంగా పని చేస్తాయని పురాతన గ్రంథాలు పేర్కొంటున్నాయి.

2)

అర్జున పాత్ర

అర్జున పత్రాలను తినడం వల్ల దంతపు ఎముకలను దృఢపరుస్తుంది. ఆయుర్వేదం శాస్త్రం స్పష్టం చేస్తుంది.

3)

అపామార్గ పత్ర

ఈ పత్రాలు ప్రసూతి, గైనకాలజీ చికిత్సలో ఉపయోగిస్తారు

4)

కరవీర పత్ర

ఈ పత్రాలను చర్మ వ్యాధులతోపాటు హృదయ సంబంధిత చికిత్సలో వినియోగిస్తారని ఆయుర్వేద శాస్త్రంలో స్పష్టం చేశారు.

5)

కేతకీ పాత్ర

నెయ్యి కలిపిన కేవడా పూల రసం తీసుకుంటే.. మూత్ర సమస్యలను దూరం చేస్తుంది.

6)

జాజి పాత్ర

ఈ ఆకులను మెత్తగా రుబ్బి గాయాలపై రాస్తే.. వెంటనే మానిపోతాయి. అలాగే ఈ పత్రాలు అల్సర్‌ను సైతం నయం చేసేందుకు వినిగియోస్తారు.

7)

దాదిమి పత్ర

ఈ పత్రాలు పేగు సంబంధిత వ్యాధులను నివారించేందుకు దివ్యౌషధంగా పని చేస్తుంది.


vinayaka1.jpg

8)

బృహతి పత్ర

వంకాయ పండ్లు, గింజలు తీసుకోవడం వల్ల దంతక్షయాన్నే కాదు.. పంటి నొప్పిని సైతం తగ్గిస్తుంది.

9)

తులసి పత్ర

ఈ పత్రాలను జలుబు, దగ్గుతోపాటు జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగిస్తారు. అత్యంత ఔషధ గుణాలున్నా పత్రాల్లో ఇది ఒకటి.

10)

దృవ పత్ర

దూర్వా పత్రం అనేది వేడిని చల్లార్చే ఒక ప్రధాన మొక్క. ఆయుర్వేదంలోని తొలి ఔషధ మొక్కలలో ఇది ఒకటి.

11)

దేవదారు పత్ర

ఉబ్బసం, మధుమేహాన్ని నియంత్రించడంలో ఈ పత్రం ప్రభావవంతంగా పని చేస్తుంది.

12)

దాతురా పత్ర

ఇది శ్వాసకోశ వ్యాధులను నివారించడంలో ఈ పత్రం సమర్థవంతమైన ఔషధంగా పని చేస్తుంది.

13)

అశ్వథ పత్ర

యుక్త వయస్సులో వచ్చే మొటిమలను నయం చేయడంలో ఈ అశ్వథ ఆకులు బాగా పని చేస్తాయి.

14)

బిల్వ పత్ర

ప్రేగు సంబంధిత వ్యాధులకు నయం చేసే అద్భుతమైన ఔషధంగా ఈ పత్రం పని చేస్తుంది.


vinayakudu-222.jpg

15)

బదరీ పత్ర

ఈ పత్రాలను పచ్చడిగా చేసుకుని.. అన్నంతో కలిపి తీసుకుంటే ఊబకాయం త్వరితగతిన తగ్గుతుంది.

16)

మరువక పాత్ర

ఇది సుగంధ ఆకులకు ప్రసిద్ధి చెందింది.

17)

సంధ్య పుష్పిన్ పాత్ర

ఇది ప్రధానంగా నోటి వ్యాధులకు ఉపయోగించే మొక్క

18)

బృంగరాజ పాత్ర

బృంగరాజ పత్రం.. జుట్టు రంగుతోపాటు జుట్టు పెరుగుదలకు సైతం ఉపయోగపడుతుంది.

19)

అర్క పత్ర

ఇది శరీరంలోని వివిధ గ్రంధులను ఉత్తేజపరిచడంతోపాటు వాటి పనితీరును మెరుగుపరచడానికి ఈ పత్రాలను వినియోగిస్తారు.

20)

విష్ణు క్రాంత పత్ర

ఇది మనస్సును మెరుగుపరిచే సాధనంగా ప్రసిద్ధి చెందింది.

21)

శమీ పత్ర

శమీ 'శమయతి రోగాన్ ఇతి' అంటే రోగాలను తగ్గించేది అని అర్థం.


ఇవి కూడా చదవండి..

Vinayaka Chavithi Special 2024: గణపతి పూజ ఎలా చేయాలి.. కావాల్సిన సామాగ్రి..?

Vinayaka Chavithi Special 2024: ముస్లిం దేశాల్లో పూజలందుకొంటున్న ‘గణపతి’

Vinayaka Chavithi Special 2024: ఇంతకీ పండగ శుక్రవారమా? లేక శనివారమా?.. పండితులు ఏం చెబుతున్నారంటే?..

Vinayaka Chavithi Special 2024: పండగ రోజు విద్యార్థులు ఇలా చేస్తే మాత్రం వారికి తిరుగే ఉండదు..

Vinayaka Chavithi Special 2024: ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలి. ఏ మంత్రం చదివి పూజించాలంటే..

Updated Date - Sep 06 , 2024 | 05:56 PM