Share News

Kartika Masam: కార్తీక మాసంలో తులసికి ఈ వస్తువులు సమర్పిస్తే.. అదృష్టం.. ఐశ్వర్యం..

ABN , Publish Date - Nov 05 , 2024 | 03:40 PM

కార్తీక మాసంలో తులసి మొక్కకు ఈ మూడు వస్తువులు సమర్పిస్తే ఐశ్వర్య ప్రాప్తి.

Kartika Masam: కార్తీక మాసంలో తులసికి ఈ వస్తువులు సమర్పిస్తే.. అదృష్టం.. ఐశ్వర్యం..

కార్తీక మాసం శివకేశవ భక్తులకు ఎంతో ప్రీతికరం. ఈ రోజుల్లో శివాలయాలు దీపాలతోనూ, అర్చనలతోనూ, అబిషేకాలతోనూ సందడి చేస్తుంటాయి. ప్రతి ఇంట్లో కూడా కార్తీక మాసం పూర్తయ్యేవరకు ఇంట్లోనూ, ఇంటి ద్వారానికి ఇరు వైపులా దీపాలు దర్శనమిస్తాయి. ఇక కార్తీక మాసంలో తులసి కోట దగ్గర దీపానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. కేవలం దీపం మాత్రమే కాదు.. తులసికి సమర్పించే వస్తువులకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మూడు రకాల వస్తువులు సమర్పించడం వల్ల తులసి సంతోషిస్తుందని, ఇంటికి సుఖ సంతోషాలు ప్రసాదిస్తుందని అంటున్నారు. ఇంతకీ కార్తీక మాసంలో తులసికి సమర్పించాల్సిన వస్తువులు ఏంటో తెలుసుకుంటే..

Instant Coffee: ఇన్సంట్ కాఫీ తాగడం మంచిదేనా.. వైద్యులు ఏమంటున్నారంటే..


తులసిని సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి గా భావిస్తారు. లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తారు. తులసిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయి. అలాగే తులసికి మూడు వస్తువులు కూడా సమర్పించాలి.

అలంకరణ..

  • కార్తీక మాసంలో తులసిని పూజించేటప్పుడు అలంకరణ చేయడం ఒక సంప్రదాయం. ఇందులో భాగంగా తులసి కోటకు, మొక్కకు చీర, జాకెట్ ముక్క, ఆభరణాలు, పూలు, పసుపు, కుంకుమ వంటివి సమర్పించి లక్ష్మీదేవికి ప్రతిరూపంగా కొలుస్తారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందట.

  • తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

  • కార్తీక మాసంలో తులసిని పూజించేటప్పుడు తులసికి ఎరుపు రంగు వస్త్రం సమర్పించాలి. ఇలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని అంటున్నారు. అలాగే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

Health Tips: వెల్లుల్లి ఇలా తింటే యూరిక్ యాసిడ్ సమస్య మాయం..

ఆవాల నూనెతో పాదాలకు మసాజ్ చేస్తే కలిగే ప్రయోజనాలు ఇవే..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Nov 05 , 2024 | 03:40 PM