Today Horoscope : ఈ రాశి వారికి మంచి రోజులు వచ్చాయి
ABN , Publish Date - Jun 02 , 2024 | 07:08 AM
ఈరోజు రాశి వారికి ఆదివారం (జూన్ 02-06-2024) విద్యా విషయాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. రవాణా, బోధన, కమ్యూనికేషన్లు, స్టేషనరీ రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. అన్నదమ్ముల వ్యవహారశైలిలో మార్పులు గమనిస్తారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
విద్యా విషయాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. రవాణా, బోధన, కమ్యూనికేషన్లు, స్టేషనరీ రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. అన్నదమ్ముల వ్యవహారశైలిలో మార్పులు గమనిస్తారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
సినిమాలు, రాజకీయాలు, విదేశీ వ్యవహారాలకు చెందిన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. ఆధ్యాత్మిక, సేవా రంగాల వారికి ప్రోత్సాహకరమైన రోజు.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. పెట్టుబడులు, నిధుల సేకరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత పదవులు అందుకుంటారు. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సినిమాలు, రాజకీయాలు, ప్రభుత్వ రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరంలో ఉన్న పెద్దల సహకరారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, రక్షణ, న్యాయ, రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. సమావేశాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. దుర్గామాతను ఆరాధించండి.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుణప్రయత్నాలు, పెట్టుబడుల విషయంలో పెద్దవారి సహకారం లభిస్తుంది. పన్నులు, బీమా, పెన్షన్, గ్రాట్యుటీ వ్యవహారాలకు అనుకూలం. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. దుర్గామాత ఆరాధన శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. జనసంబఽధాలు విస్తరిస్తాయి. సమావేశాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు సంకల్పం నెరవేరుతుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పరిశ్రమలు, వ్యవసాయం రంగాల వారికి అవసరానికి నిధులు సర్దుబాటు అవుతాయి. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు సంభవం. సినిమాలు, టెలివిజన్, క్రీడలు, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుబంధాలు బలపడతాయి. దుర్గామాత ఆలయాన్ని దర్శించండి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. రవాణా, మార్కెటింగ్, కమ్యూనికేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. చర్చలు ఫలిస్తాయి. సూర్యష్టక పారాయణ శుభప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
గృహనిర్మాణం, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల కోసం ఖ ర్చు చేస్తారు. ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ