Share News

Today Horoscope : ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో మీ సంకల్పం నెరవేరుతుంది

ABN , Publish Date - Dec 12 , 2024 | 06:06 AM

ప్రయాణాలకు కావలసిన నిధులు సర్దుబాటవుతాయి. ఆడిటింగ్‌, న్యాయరంగాల వారు శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు.

Today Horoscope : ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో మీ సంకల్పం నెరవేరుతుంది

రాశిఫలాలు

12-12-2024 - గురువారం

01 Mesham - Aries.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలకు కావలసిన నిధులు సర్దుబాటవుతాయి. ఆడిటింగ్‌, న్యాయరంగాల వారు శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. పెట్టుబడుల విషయంలో మీ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ప్రయాణాల్లో నిదానం పాటించాలి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.


02 Vrushabham - Taurus.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో మీ సంకల్పం నెరవేరుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మూచ్యువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకు అనుకూలం. పన్నుల వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. మరమ్మతులకు ఖ్చులు అధికం. ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. గోమాతను సేవించండి.


03 Mithunam - Gemini.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

దీర్ఘకాలిక పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీవారు శ్రీమతి వైఖరి ఆ వేదన కలిగిస్తుంది. మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. శ్రీ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ శుభప్రదం.


04 Karkatakam - Cancer.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా లాభిస్తుంది. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు అనుకోని చిక్కులు ఎదుర్కొంటారు. సన్నిహితుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సాయిబాబాను ఆరాధించండి.


05 Simha - Leo.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం. ఆర్థిక విషయాల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. శ్రీ దత్త కవచ పారాయణ శుభప్రదం.


06 Kanya - Virgo.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తారు. వీసా, పాస్‌పోర్ట్‌ వ్యవహరాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు వసతి లభిస్తుంది. న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. రాతకోతల్లో నిదానం అవసరం. చర్చలు ఫలించకపోవడంతో ఆశాంతికి లోనవుతారు. గోమాతను ఆరాధించండి.


07 Tula - libra.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

షాపింగ్‌, చర్చలు ఆనందం కలిగిస్తాయి. తోబుట్టువుల విషయంలో శుభపరిణామాలు సంభవం. ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఆ రోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గాయత్రీ మాత ఆరాధన శుభప్రదం.


08 Vruschikam - Scorpio.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. భాగస్వామి సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. పందాలు, పోటీల్లో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రత్యర్థుల కారణంగా ఆశాంతికి లోనవుతారు. గాయత్రీ అష్టోత్తర శతనామ పారాయణ శుభప్రదం.


09 Dhanassu - Sagittarius.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. హోటల్‌, ఫార్మా, క్యాటరింగ్‌ రంగాల వారు కొత్త ఆలోచనల అమలు చేసి విజయం సాధిస్తారు. ఆ రోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆహార నియమాలు పాటించడం అవసరం. శ్రీ దక్షిణామూర్తిని ఆరాధించండి.


10 Makaram - Capricorn.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆడిటింగ్‌, టెలివిజన్‌, సినిమా, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరంలో ఉన్న ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. దూరప్రయాణాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. సాయిబాబాను ఆరాధించండి.


11 Kumbham - Aquarius.jpg

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరిలో మార్పు గమనిస్తారు. పెట్టుబడుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సాయిబాబా ఆలయ దర్శనం శుభప్రదం.


12 Meenam - Pisces FINAL.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

గౌరవ పదవులు అందుకుంటారు. గృహనిర్మాణం, స్థలసేకరణ విషయాల్లో తలపెట్టిన పనులు పూర్తవుతాయి. పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. శ్రీ దత్తచరిత్ర పారాయణ శుభప్రదం.

- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - Dec 12 , 2024 | 07:53 AM