Share News

Today Horoscope : ఈ రాశి వారు భూమి, ఇల్లు కొనుగోలుకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు.

ABN , Publish Date - Aug 09 , 2024 | 05:39 AM

నేడు (09-08-2024 -శుక్రవాకరం) వివాహాది శుభకార్యాలకు అనుకూలం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.

Today Horoscope :  ఈ రాశి వారు భూమి, ఇల్లు కొనుగోలుకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు.

నేడు (09-08-2024- శుక్రవాకరం) వివాహాది శుభకార్యాలకు అనుకూలం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వివాహాది శుభకార్యాలకు అనుకూలం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. శ్రీవారు, శ్రీమతి విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

విందుల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులకు అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఫార్మా, వైద్యం, వ్యవసాయం, హోటల్‌, క్యాటరింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది.


MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. చిన్నారులు, ప్రియతముల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.


MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో ఇల్లు సందడిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. భూమి, ఇల్లు కొనుగోలుకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు.


MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

శుభవార్త అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. రవాణా, బోధన, స్టేషనరీ, ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.


MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. దూరప్రాంతాల్లో చదివేందుకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడిటింగ్‌, కన్సల్టెన్సీ, ఎగుమతుల రంగాల వారికి అనుకూలమైన రోజు.


MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పదిమందిలో మంచిపేరు తెచ్చుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.


MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆఽథ్మాత్యిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వేడుకలు ఆనందం కలిగిస్తాయి. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. బృందకార్య్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గుడపుతారు.


MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పెద్దలను స్మరించుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బోనస్‌లు, ఇంక్రి మెంట్లు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.


MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూలమైన రోజు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. రక్షణ, బోధన, న్యాయ, ప్రచురణల రంగాల వారికి అనుకూలమైన రోజు. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. చర్చలు ఫలిస్తాయి.


MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి సకాలంలో చేతికి డబ్బు అందుతుంది. ఆస్పత్రులు, ఫార్మా, బ్యాంకింగ్‌, మరమ్మతుల రంగాల వారికి ఆర్థికంగా అనుకూలిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Aug 09 , 2024 | 05:39 AM