Share News

Today Horoscope: ఈ రాశి వారికి షేర్‌మార్కెట్‌ లావాదేవీలు, డిపాజిట్లకు అనుకూలం

ABN , Publish Date - Jul 12 , 2024 | 05:53 AM

నేడు(12-07-2024- శుక్రవాకం ) శ్రీవారు, శ్రీమతి వ్యవహారశైలిలో మార్పు గమనిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

Today Horoscope: ఈ రాశి వారికి షేర్‌మార్కెట్‌ లావాదేవీలు, డిపాజిట్లకు అనుకూలం

నేడు(12-07-2024- శుక్రవాకం ) శ్రీవారు, శ్రీమతి వ్యవహారశైలిలో మార్పు గమనిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి వ్యవహారశైలిలో మార్పు గమనిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. న్యాయ వివాదాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.


VRUSHABHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఇంటర్వ్లూలో విజయం సాధిస్తారు. సహోద్యోగులతో చర్చలు ఆనందం కలిగిస్తాయి. వైద్య, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ఒక వార్త ఆనందం కలగిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది. తోబుట్టువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.


MITHUNAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీలోని సృజనాత్మక ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మూచ్యువల్‌ ఫండ్స్‌, చిట్‌ఫండ్‌ తదితర పెట్టుబడులు లాభిస్తాయి. క్రీడలు, బోధన, బ్యాంకింగ్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.


KARKATAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

మీ మనసు మార్పు కోరుకుంటుంది. సంకల్పం నెరవేరుతుంది. బదిలీలు, మార్పులకు అనుకూల సమయం. కుటుంబం విస్తరిస్తుంది. ఇంటి అవసరాలపై దృష్టి సారిస్తారు. హార్డ్‌వేర్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


SIMHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. దూరంలో ఉన్న మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. తోబుట్టువుల సమస్యలను పరిష్కారిస్తారు. లక్ష్యాలు సాధిస్తారు.


KANYA-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. బృందకార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. షేర్‌మార్కెట్‌ లావాదేవీలు, డిపాజిట్లకు అనుకూలం.


THULA-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పైఅధికారుల మన్ననలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులు చేపడతారు. పలుకుబడిగల వ్యక్తుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.


VRUCHIKAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. వీసా, పాస్‌పోర్డ్‌ వ్యవహారాలకు అనుకూలం. సినమాలు, రాజకీ యాలు, టెలివిజన్‌, పత్రికల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్త అందుకుంటారు. సేవా కార్యక్రమాలు మనుసుకు ఊరటనిస్తాయి.


DHANASU-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

పూర్వ మిత్రులను కలుసుకుంటారు. బృందకార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గత అనుభవంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.


MAKARAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది. పదిమందిలో మంచిపేరు తెచ్చుకుంటారు. ప్రభుత్వరంగ సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. న్యాయవిషయాల్లో పెద్దలు సహకరిస్తారు.


KUMBHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. రక్షణ, న్యాయ, బోధన, కళా రంగాల వారికి ప్రోత్సాహకరమైన సమయం. కీలక సమాచారం అందుకుంటారు. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు.


MEENAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పన్నులు, బీమా వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. రుణాలు మంజూరవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jul 12 , 2024 | 07:02 AM