Share News

Today Horoscope : ఈ రాశి వారికి ఇల్లు, స్థలసేకరణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.

ABN , Publish Date - Dec 13 , 2024 | 03:02 AM

నేడు (13-12-2024-శుక్రవారం) ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి.

Today Horoscope : ఈ రాశి వారికి ఇల్లు, స్థలసేకరణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.

నేడు (13-12-2024-శుక్రవారం) ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి.

01 Mesham - Aries.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ప్రయాణాలు, ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పెట్టబడులకు సంబంధించిన చర్చలకు అనుకూలం. విలువైన పత్రాలు, పారితోషికాలు అందుకుంటారు.


02 Vrushabham - Taurus.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు లభిస్తాయి. బోనస్‌లు, అదనపు ఆదాయం కోసం ప్రయత్నించి విజయం సాధిస్తారు. పన్నుల, బీమా, మెడికల్‌ క్లెయిములు, పెన్షన్‌ వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి.


03 Mithunam - Gemini.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

వేడుకలు, బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న ప్రియతముల నుంచి ఆనందకరమైన సమాచారం అందుకుంటారు. పదిమందిలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఆద్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.


04 Karkatakam - Cancer.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు. బందుమిత్రులతో విందు వినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. సహకార సంఘాలు, వృత్తిపర మైన సమావేశాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు.


05 Simha - Leo.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

చిన్నారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. కన్సల్టెన్సీలు, క్రీడలు, టెలివిజన్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


06 Kanya - Virgo.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

న్యాయ, బోధన, రక్షణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బందుమిత్రుతో ఆనందంగా గడుపుతారు. ఇల్లు, స్థలసేకరణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. దూరంలో ఉన్న ప్రియతముల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఉన్నత విద్యా విషయాలకు అనుకూలమైన రోజు.


07 Tula - libra.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులకు సంబంధించిన విలువైన పత్రాలు అందుకుంటారు. బిల్లులు, ఫీజులు చెల్లిస్తారు. ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకుని ముందడుగు వేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.


08 Vruschikam - Scorpio.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తపరిచయాల వల్ల ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. లలితాదేవి ఆరాధన శుభప్రదం.


09 Dhanassu - Sagittarius.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపిస్తారు. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.


10 Makaram - Capricorn.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, వీసా వ్యవహారాలకు అనుకూలమైన రోజు. పొదుపు పథకాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. ప్రియతముల వైఖరి గురించి ఆలోచిస్తారు.


11 Kumbham - Aquarius.jpg

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఇల్లు కొనుగోలు, స్థల సేకరణకు కావలసిన నిఽధులు చేతికి అందుతాయి. గృహరుణాలు మంజూరవుతాయి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. దుర్గామాతను ఆరాధించండి.


12 Meenam - Pisces FINAL.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఇంటర్య్వూలలో విజయం సాధిస్తారు. పెద్దలతో చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. గౌరవ పదవులు అందుకుంటారు. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - Dec 13 , 2024 | 03:04 AM