Share News

Today Horoscope : ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది

ABN , Publish Date - Oct 18 , 2024 | 03:22 AM

నేడు (18-10-2024- శుక్రవారం) పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది...

Today Horoscope : ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది

నేడు (18-10-2024- శుక్రవారం) పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. షేర్‌మార్కెట్‌ లావాదేవీలకు అనుకూలం. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. దుర్గామాత ఆరాధన శుభప్రదం.


MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

కొత్త ప్రాజెక్టులు చేపట్టి విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలమైన రోజు.


MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

సినిమాలు, రాజకీయాలు, టెలివిజన్‌, ఎఠిుమతుల రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రచురణలు, ఆడిటింగ్‌ రంగాల వారికి అనుకూలమైన రోజు.


MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఇంట్లో వేడుకలు, శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.


MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పెద్దలతో చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. దుర్గాష్టక పారాయణ శుభప్రదం.


MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉన్నత చదువులు విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. న్యాయ, బోధన, ప్రచురణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.


MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బీమా, పన్నులు, పెన్షన్‌ వ్యవహారాలపై దృష్టి పెడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరమ్మతులు, హార్డ్‌వేర్‌ రంగాల వారికి అనుకూలమైన రోజు.


MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతికి సంబంధించిన విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. జనసంబంఽధాలు విస్తరిస్తాయి. సన్నిహితుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. న్యాయ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. లలితాదేవి ఆరాధన శుభప్రదం.


MESHAM-09.jpg

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మహాలక్ష్మీ ఆరాధన శుభప్రదం.


MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. సృజనాత్మకంగా వ్యవహరించి ఉద్యోగ వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. క్రీడలు, విద్య, ఆడిటింగ్‌, టెలివిజన్‌ రంగాల వారు పెద్దల సహకారం అందుకుంటారు. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.


MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు ఆనుకూలం. కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు. గాయత్రీమాత ఆరాధన శుభప్రదం.


MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు సమావేశాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సన్నిహితుల ఆ రోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Oct 18 , 2024 | 03:22 AM