Today Horoscope : ఈ రాశి వారికి వేడుకలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి
ABN , Publish Date - Sep 20 , 2024 | 06:04 AM
నేడు (20-09-2024- శుక్రవారం ) ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. వ్యాపార రంగంలో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు....
నేడు (20-09-2024- శుక్రవారం ) ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. వ్యాపార రంగంలో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. వ్యాపార రంగంలో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. సిబ్బంది నియామకాలకు అనుకూలమైన రోజు. కేటరింగ్, ఫార్మా, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ దుర్గామాత ఆరాధన శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ప్రియతములతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. మెయిల్, వాట్సాప్ సందేశాలు ఆనందం కలిగిస్తాయి. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
బ్యాంకులు, సహకార సంఘాలు, ఫైనాన్స్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటిక కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు సంబంధించిన ఒక నిర్ణయానికి వస్తారు. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాల ఫలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. పైఅధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారరంగంలోని వారికి ముఖ్యమైన సమాచారం లభిస్తుంది. గౌరవ, మర్యాదలు అందుకుంటారు. లలితా సహస్ర నామ పారాయణ శుభప్రదం.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాలకు సంబంధించిన చచర్చలు, ప్రయాణాలకు అనుకూలం. వేడుకలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పారితోషికాలు అందుకుంటారు. పెట్టుబడుల విషయంలో మీ అంచనాలు ఫలిస్తాయి. శ్రీ లలితాదేవి ఆరాధన శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
వైద్యం, పరిశోధనలు, ఫార్మా, ఇన్సూరెన్స్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అమ్మవారి ఆరాధన శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవారంగాల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దుర్గామాత ఆరాదన శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
హోటల్, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సహోద్యోగుల సహకారం ల భిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. మెడికల్ క్లెయిములు మంజూర వుతాయి.
ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. చిట్ఫండ్, పాఠశాలలు, అడ్వర్టయిజ్మెంట్ రంగాల్లోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారుల విషయంలో శుభపరిణామలు చోటుచేసుకుంటాయి. పెట్టుబడుల విషయంలో పెద్దల సహకారం లభిస్తుంది.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. దూరంలో ఉన్న బంధుమిత్రులు ఇల్లు చేరుకుంటారు. పాస్పోర్ట్, వీసా పనులు పూర్తవుతాయి. కొంత కాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. లలితా సహస్రనామ పారాయణ శుభప్రదం.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో తోబుట్టువుల సహకారం లభిస్తుంది. విద్య, ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. స్టేషనరీ, మార్కెటింగ్, రవాణా, విద్యా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతికి సంబంధించిన విషయాల్లో శుభపరిణామలు సంభవం. భాగస్వామ్యాలు లాభిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. బ్యాంకులు, ఫైనాన్స్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ