Share News

Today Horoscope : ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత...

ABN , Publish Date - Aug 30 , 2024 | 03:31 AM

నేడు (30-08-2024- శుక్రవారం) రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.

Today Horoscope : ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత...

నేడు (30-08-2024- శుక్రవారం) రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.


02 VRUSHABAMAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. రవాణా, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. శ్రీ దుర్గామాత మూర్తి ఆరాధన శుభప్రదం.


03 MITHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. గృహనిర్మాణం, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం ఖ ర్చులు అధికం. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

విద్యా విషయాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. రవాణా, బోధన, కమ్యూనికేషన్లు, స్టేషనరీ రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. తోబుట్టువులు, సన్నిహితుల వ్యవహారశైలి ఆవేదన కలిగిస్తుంది. శ్రీ లలితా సహస్ర నామ పారాయణ శుభప్రదం.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

సినిమాలు, రాజకీయాలు, విదేశీ వ్యవహారాలకు చెందిన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం అందక పోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. ఆధ్యాత్మిక, సేవా రంగాల వారికి ప్రోత్సాహకరమైన రోజు.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. పెట్టుబడులు, నిధుల సేకరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దుర్గామాత ఆరాధన శుభప్రదం.


07 THULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉన్నత పదవులు అందుకుంటారు. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సినిమాలు, రాజకీయాలు, ప్రభుత్వ రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరంలో ఉన్న పెద్దల సహకరారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.


08 VRUSHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, రక్షణ, న్యాయ, రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. సమావేశాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. అమ్మవారిని ఆరాధించండి.


09 DHANASSU.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

రుణప్రయత్నాలు, పెట్టుబడుల విషయంలో పెద్దవారి సహకారం లభిస్తుంది. పన్నులు, బీమా, పెన్షన్‌, గ్రాట్యుటీ వ్యవహారాలకు అనుకూలం. మెడికల్‌ క్లెయిములు మంజూరవుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

జనసంబధాలు విస్తరిస్తాయి. సమావేశాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు సంకల్పం నెరవేరుతుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పందాలు, పోటీల్లో నష్టపోయే అవకాశం ఉంది. దుర్గామాతను ఆరాధించండి.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పరిశ్రమలు, వ్యవసాయం రంగాల వారికి అవసరానికి నిధులు సర్దుబాటు అవుతాయి. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.


12 MEENAM.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు సంభవం. సినిమాలు, టెలివిజన్‌, క్రీడలు, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుబంధాలు బలపడతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Aug 30 , 2024 | 03:31 AM