Today Horoscope : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే ?
ABN , Publish Date - Jun 28 , 2024 | 06:35 AM
నేడు(28-07-2024-శుక్రవారం), రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.
నేడు(28-07-2024-శుక్రవారం), రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ యానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎగుమతులు, ఫొటోగ్రఫీ, ఉన్నత విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాలు, ఆర్థిక సమావేశాలకు అనుకూలం. షేర్‌మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి. కార్పొరేట్ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
రాజకీయ, సినీ రంగాల వారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించి విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. గౌరవ పదవులు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. రాజకీయాలు, కళలు, రవాణా, బోధన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
బీమా, పన్నులు, పెన్షన్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి. ఆర్థిక విషయాల్లో గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించండి.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. వివాహ నిర్ణయం కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మీ సంకల్పం నెరవేరుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
సన్నిహితులతో వేడుకల్లో పాల్గొంటారు. కొత్త వ్యూహాలు అమలు చేసి విజయం సాదిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, ఆహారరంగ ఉద్యోగులు, వ్యాపారులకు ప్రోత్సాహకరమైన రోజు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. టెలివిజన్, ఆడిటింగ్, కన్సల్టెన్సీ, సాహిత్య రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మూచ్యువల్ ఫండ్స్, పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ సామగ్రి వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. బదిలీలు, మార్పులకు అనుకూల సమయం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులను సమీక్షించుకుంటారు.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. మార్కెటింగ్ రంగంలోని వారికి కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఏజెన్సీలు, స్టేషనరీ, రవాణా రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు, పొదుపు పధకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకులు, ట్‌ఫండ్ రంగాల వారికి అనుకూల సమయం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
మీ మనసు మార్పు కోరుకుంటుంది. మీ ఆలోచనలను సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రి యల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూలం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ