Today Horoscope : ఈ రాశి వారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.
ABN , Publish Date - Oct 07 , 2024 | 03:00 AM
నేడు(07-10-2024-సోమవారం) ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
నేడు(07-10-2024-సోమవారం) ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. పందాలు, పోటీల్లో నిదానం పాటించడం అవసరం. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది. శివారాధన శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాలకు ఖర్చులు అధికం. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సేవలు వ్యవసాయం, పరిశ్రమలు, ఫార్మా, రిటైల్ రంగాల వారికి అనుకూల సమయం. బంధుమిత్రులతో ఉల్లాసగా గడుపుతారు. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. గోసేవ శుభప్రదం.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఇంట్లో వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటారు. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. అడ్వర్టయిజ్మెంట్, ఆడిటింగ్, టెలివిజన్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పరమశివుని ఆరాధించండి.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి చర్చలు ఫలిస్తాయి. ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. అగ్రిమెంట్లు, రాతకోతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శివాలయ సందర్శన శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. పొదుపు పథకాలు, పెట్టుబడులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. విలువైన పత్రాలు సకాలంలో చేతికి అందుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. పెట్టుబడులపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. శివారాధన శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం. తలపెట్టిన పనుల్లో జాప్యం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
వేడుకలు ఆనందం కలిగిస్తాయి. ప్రచురణ, టెక్స్టైల్స్, సినిమా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య, దూరప్రయాణాలకు అవసరమైన నిదులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో బందుమిత్రుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
పది మందిలో గౌరవ, మర్యాదలు అందుకుంటారు. సమావేశాలు, వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వేడుకలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. శివారాధన శుభప్రదం.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. ప్రయణాలు, చర్చలకు అనుకూలం. గౌరవ, మద్యాదలు, ఉన్నత పదవులు అందుకుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్ల్యాలు సాధిస్తారు. రాజకీయ, న్యాయరంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలు, విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. వేడుకల్లో ఖర్చులు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పరమశివుని ఆరాధించండి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ