Today Horoscope : ఈ రాశి వారు కొత్త ఆలోచనలు అమలు చేసేందుకు అనుకూల సమయం
ABN , Publish Date - Nov 11 , 2024 | 05:53 AM
నేడు (11-11-2024 - సోమవారం) ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు....
నేడు (11-11-2024 - సోమవారం) ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. బ్యాంక్ డిపాజిట్లు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ, ప్రతిష్ఠలు పెంపొందుతాయి. ప్రభుత్వ అధికారుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి.. పరమ శివుని ఆలయాన్ని దర్శించండి.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. న్యాయ, బోధన, రక్షణ, రవాణా రంగాల వారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. పెద్దలతో సమావేశాలు ఫలిస్తాయి. కొత్త వ్యూహాలను అమలు చేసి విజయం సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో అంచనాలు ఫలిస్తాయి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
విందు వినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్పత్రులు, బ్యాంకులు, చిట్ఫండ్లు, మూచ్యువల్ ఫండ్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. శివ అటోత్తర శతనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. స్పెక్యులేషన్లు, పెట్టుబడులపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన కీలక సమాచారం అందుకుంటారు. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్, ఆస్పత్రుల రంగాల వారికి అనుకూల సమయం. సహోద్యోగులతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. చిట్ఫండ్, ప్రకటనలు, కళా రంగాల వారికి అనుకూలమైన రోజు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త ఆలోచనలు అమలు చేసేందుకు అనుకూల సమయం. ఫర్నీచర్, నిత్యావసరాలు, హార్డ్వేర్ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గృహనిర్మాణం, స్థల సేకరణ, అద్దె నిర్ణయాల గురించి ఆరాతీస్తారు.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. స్టేషనరీ, రవాణా, ఏజెన్సీలు, మార్కెటింగ్ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. విదేశీ ప్రయాణాలు, ఇంటర్వ్యూలకు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుంటారు. గోమాతను ఆరాధించండి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, ఉత్సవాల్లో పాలొంగంటారు. వ్యాపారరంగంలోని వారికి అర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. అదనపు ఆదాయం అందుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. డిపాజిట్లపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. రుణాలు మంజూరవుతాయి.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
పదిమందిలో గౌరవ మన్ననలు అందుకుంటారు. వేడుకలు ఆనందం కలిగిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు, చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రమోషన్లు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. సేవా కార్యక్రమాలు తృప్తినిస్తాయి.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ