Share News

Today Horoscope : ఈ రాశి వారు సన్నిహితుల నుంచే సమస్యలు ఎదుర్కొంటారు.

ABN , Publish Date - Dec 23 , 2024 | 02:09 AM

నేడు (23-12-2024-సోమవారం) కుటుంబ సభ్యుల వైఖరి కారణంగా ఆవేదనకు గురవుతారు.

Today Horoscope : ఈ రాశి వారు సన్నిహితుల నుంచే సమస్యలు ఎదుర్కొంటారు.

నేడు (23-12-2024-సోమవారం) కుటుంబ సభ్యుల వైఖరి కారణంగా ఆవేదనకు గురవుతారు.

01 Mesham - Aries.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల వైఖరి కారణంగా ఆవేదనకు గురవుతారు. పెద్దల నుంచి మాటపడాల్సి రావచ్చు. కోర్టు కే సుల కారణంగా చిక్కులు ఎదురవుతాయి. సమావేశాల్లో జాగ్రత్తలు పాటించాలి. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభఫలితాను ఇస్తుంది.


02 Vrushabham - Taurus.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

విందు వినోదాల్లో పరిమితి పాటించాలి. వ్యవసాయం. పరిశ్రమల రంగాల వారికి అనుకోని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సన్నిహితుల కారణంగా చిక్కులు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. మహాదేవుని ఆరాధించండి.


03 Mithunam - Gemini.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. టెలివిజన్‌, క్రీడలు, విద్యా రంగాల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. శివుని ఆలయాన్ని దర్శించండి.


04 Karkatakam - Cancer.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు. సమావేశాలకు ఏర్పాట్లలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు సన్నిహితుల నుంచే సమస్యలు ఎదుర్కొంటారు. వసతి లోపం కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. గోసేవ శుభప్రదం.


05 Simha - Leo.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ఒక సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. డ్రైవింగ్‌ లో జాగ్రత్తలు పాటించాలి. కమ్యూనికేషన్లు, స్టేషనరీ, రవాణా రంగాల వారికి కొంత నిరుత్సాహంగా ఉంటుంది. శ్రీ శివ సహస్రనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.


06 Kanya - Virgo.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారుల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, జ్యుయలరీ రంగాల వారి అంచనాలు ఫలించకపోవచ్చు. విలువైన వస్తువులు జాగ్రత్త. మహాదేవుని ఆలయాన్ని దర్శించండి.


07 Tula - libra.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. అన్ని పనులకు ఆటంకాలు ఎదురవడంతో నిరుత్సాహానికి లోనవుతారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. మనశ్శాంతి లోపిస్తుంది. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.


08 Vruschikam - Scorpio.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య విదేశీ వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు, చర్చలు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు అవసరం. సినిమాలు, రాజకీయ రంగాల వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. శివ అష్టోత్తరనామ పారాయణ శుభ ప్రదం.


09 Dhanassu - Sagittarius.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సమావేశాలు, వేడుకల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి అనుకోని ఆంటకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గోసేవ శుభప్రదం.


10 Makaram - Capricorn.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ప్రభుత్వ సంస్థల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో పెద్దలు, పైఅధికారుల సహకారం లోపిస్తుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ప్రముఖులను కలుసుకుంటారు. సేవా కార్యక్రమాలు మనశ్శాంతినిస్తాయి.


11 Kumbham - Aquarius.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చల్లో నిదానం పాటించాలి. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురయ్యే అవ కాశం ఉంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.


12 Meenam - Pisces FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ప్రియతముల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైద్యానికి ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. రుణ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. రుద్రుని ఆరాధన శుభప్రదం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Dec 23 , 2024 | 02:09 AM