Share News

Today Horoscope : ఈ 5 రాశుల కలవారు వ్యాపార రంగంలో రాణిస్తారు !

ABN , Publish Date - Jul 13 , 2024 | 05:34 AM

నేడు ( 13-07-2024-శనివారం ) భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఇంట్లో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. స్పెక్యులేషన్లు, పెట్టుబడులపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు.

Today Horoscope :  ఈ 5 రాశుల కలవారు వ్యాపార రంగంలో రాణిస్తారు !

నేడు ( 13-07-2024-శనివారం ) భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఇంట్లో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. స్పెక్యులేషన్లు, పెట్టుబడులపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఇంట్లో వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. స్పెక్యులేషన్లు, పెట్టుబడులపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


VRUSHABHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన కీలక సమాచారం అందుకుంటారు. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, ఆస్పత్రుల రంగాల వారికి అనుకూల సమయం. సహోద్యోగులతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. విందుల్లో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.


MITHUNAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులు, చిట్‌ఫండ్‌, ప్రకటనలు, కళా రంగాల వారికి అనుకూలమైన రోజు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.


KARKATAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఫర్నీచర్‌, నిత్యావసరాలు, హార్డ్‌వేర్‌ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహనిర్మాణం, స్థల సేకరణ, అద్దె నిర్ణయాల గురించి ఆరాతీస్తారు. కొత్త ఆలోచనలు అమలు చేసేందుకు అనుకూల సమయం.


SIMHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

స్టేషనరీ, రవాణా, ఏజెన్సీలు, మార్కెటింగ్‌ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. విదేశీ ప్రయాణాలు, ఇంటర్వ్యూలకు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుంటారు. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.


KANYA-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

వ్యాపారరంగంలోని వారికి అర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. అదనపు ఆదాయం అందుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. డిపాజిట్లపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. రుణాలు మంజూరవుతాయి.


THULA-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు, చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పదిమందిలో గౌరవ మన్ననలు అందుకుంటారు. ప్రమోషన్లు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు.


VRUCHIKAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఆలయాలు, హాస్టళ్లు సందర్శిస్తారు. సేవా కార్యక్రమాలు తృప్తినిస్తాయి.


DHANASU-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. బ్యాంక్‌ డిపాజిట్లు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.


MAKARAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ, ప్రతిష్ఠలు పెంపొందుతాయి. ప్రభుత్వ అధికారుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి.. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి.


KUMBHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

న్యాయ, బోధన, రక్షణ, రవాణా రంగాల వారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలను అమలు చేసి విజయం సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో అంచనాలు ఫలిస్తాయి. సమావేశాలు, విందుల్లో పాల్గొంటారు.


MEENAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్పత్రులు, బ్యాంకులు, చిట్‌ఫండ్‌లు, మూచ్యువల్‌ ఫండ్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గ్రాట్యుటీ, బీమా, పెన్షన్‌ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jul 13 , 2024 | 05:35 AM