Share News

Today Horoscope: ఈ రాశి వారికి విలువైన పత్రాలు అందుకుంటారు.

ABN , Publish Date - Jul 27 , 2024 | 05:17 AM

నేడు (27-07-2024 - శనివారం ) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వినూత్న మార్గంలో ఆలోచించి విజయం సాధిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం.

Today Horoscope: ఈ రాశి వారికి విలువైన పత్రాలు అందుకుంటారు.

నేడు (27-07-2024 - శనివారం ) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వినూత్న మార్గంలో ఆలోచించి విజయం సాధిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వినూత్న మార్గంలో ఆలోచించి విజయం సాధిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. టెలివిజన్‌, సినిమాలు, గ్రాఫిక్స్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


VRUSHABHAM-02 - Copy.jpg

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

విదేశీ విద్య కోసం చే సే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు. వీసా, పాస్‌పోర్ట్‌ వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.


MITHUNAM-03 - Copy (2).jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

విలువైన పత్రాలు అందుకుంటారు. పెట్టుబడులకు సంబంధించిన చర్చలకు అనుకూలమైన రోజు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


KARKATAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాల్లో పెద్దల సహకారంల లభిస్తుంది. ఉన్నత పదవులకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.


SIMHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

మీ అంచనాలు ఫలిస్తాయి. రాజకీయాలు, ప్రచురణలు, న్యాయ, బోధన, రవాణా, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు.


KANYA-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. రుణాలు మంజూర వుతాయి.


THULA-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. బందుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


VRUCHIKAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల సహకారంతో వృత్తి పరమైన లక్ష్యాలు సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార రంగానికి చెందిన పెద్దలను కలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.


DHANASU-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. న్యాయ, బోధన, రవాణా, ప్రకటనల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పొదుపు పథకాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు.


MAKARAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

గృహ నిర్మాణం, స్థలసేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మరమ్మతులకు వెచ్చిస్తారు. సంకల్పం ఫలిస్తుంది.


KUMBHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

భాగస్వాములతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.


MEENAM-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. వైద్యానికి అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. పరిశ్రమలు, వ్యవసాయం, చిట్‌ఫండ్‌లు, సేవల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

Updated Date - Jul 27 , 2024 | 05:17 AM