Today Horoscope : ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.
ABN , Publish Date - Dec 01 , 2024 | 06:06 AM
నేడు (01-12-2024-ఆదివారం) ప్రచురణలు, టెలివిజన్, ఉన్నత విద్యా రంగాల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది.
నేడు (01-12-2024-ఆదివారం) ప్రచురణలు, టెలివిజన్, ఉన్నత విద్యా రంగాల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ప్రచురణలు, టెలివిజన్, ఉన్నత విద్యా రంగాల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు, చర్చల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దూరంలో ఉన్న బంధుమిత్రులకు సంబంధించిన ఒక సమాచారం కలవరపెడుతుంది. అంచనాలు ఫలించకపోవచ్చు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
వైద్యం, హార్డ్‌వేర్, వడ్డీ వ్యాపార రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వైద్యం కోసం ఖర్చులు అధికం. మ్యూచ్యువల్ ఫండ్‌లలో పెట్టుబడులకు అనుకూలం. మరమ్మతులకు ఖర్చు చేస్తారు. సూర్యాష్టక పారాయణ శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో మాటపడాల్సి రావచ్చు. న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పెట్టుబడులపై ఆశించిన ప్రతిఫలం రాకపోవచ్చు. పందాలు, పోటీల్లో కొంత నష్టపోయే అవకాశం ఉంది. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం విషయంలో శ్రద్ద చూపించాలి. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగాల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం అందకపోవడంతో నిరుత్సాహపడతారు. ఇంటర్వ్యూలలో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. సూర్యాష్టక పారాయణ శుభప్రదం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, క్రీడలు, విద్య, చిట్‌ఫండ్ రంగాల వారికి ఆర్థికంగా నిరుత్సాహకరంగా ఉంటుంది. చిన్నారుల వైఖరి ఆ వేదన కలిగిస్తుంది. కొత్త ప్రయోగాలకు ఇది తగిన సమయం కాదు. ఆడిటింగ్, అడ్వర్టయిజ్‌మెంట్, అలంకరణ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు, స్థల సేకరణకు సంబంధించిన అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల వైఖరి ఆ వేదన కలిగిస్తుంది. సూర్యాష్టక పారాయణ శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మార్కెటింగ్, రవాణా, ఆటోమొబైల్ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. షాపింగ్‌లో నాణ్యతను గమనించాలి. సకాలంలో డబ్బు చేతికి అందకపోవడంతో అసౌకర్యానికి గురవుతారు. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. సూర్యాష్టక పారాయణ శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
కొత్త ప్రాజెక్టులను వాయిదా వేయడం మంచిది. లక్ష్యాలు అందుకోవడంలో ఆటంకాలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు పూర్తి కాకపోవడంతో మనశ్శాంతి లోపిస్తుంది. మీ ఆలోచనలను సమీక్షించుకుంటారు. సూర్య భగవానుడిని ఆరాధించండి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
వీసా, పాస్‌పోర్ట్ వ్యవహారాల్లో కొంత అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంది. సినిమాలు, రాజకీయాలు, ఎఠిుమతుల రంగాల వారికి నిరుత్సాహకరంగా ఉంటుంది. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
సహకార సంఘాలు, యూనియన్ వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో నిరుత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఆర్థిక పరమైన ఒత్తిళ్లు ఎదురవుతాయి. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
పెద్దల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురువుతాయి. గౌరవ ప్రతిష్ఠలకు కొంత భంగం కలిగే అవకాశం ఉంది. సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. నలుగురిలో మాటపడాల్సి వస్తుంది. అన్నదానం శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ