Today Horoscope : ఈ రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో మంచి పరిణామాలు జరుగుతాయి.
ABN , Publish Date - Nov 10 , 2024 | 02:50 AM
నేడు (10-11-2024- ఆదివారం) దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.
నేడు (10-11-2024- ఆదివారం) దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఆోగ్యం మెరుగుపడతుంది. రాజకీయ, సినీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. బందుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆ ఉల్లాసం కలిగిస్తుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఫార్మా, వైద్యం, వ్యవసాయం, హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
మీలోని సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. చిన్నారులు, ప్రియతముల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. సినిమాలు, టెలివిజన్, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
నిర్మాణ రంగం వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. భూమి, ఇల్లు కొనుగోలుకు అవసరమైన నిధులు అందుతాయి. గోసేవ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
జనసంబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామి గురించి కీలక సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. శ్రీ దుర్గామాత ఆరాధన శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. వైద్య సేవలకు అవసరమైన నిధులు అదుతాయి. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. శ్రీ ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. స్టాక్‌మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి. బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిస్తాయి. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
కుటుంబ వ్యవహారాల్లో మంచి పరిణామాలు జరుగుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి గత అనుభవం తోడ్పడుతుంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గుడపుతారు. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. బోనస్‌లు, ఇంక్రి మెంట్లు అందుకుంటారు. పెద్దల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సూర్యారాధన శుభప్రదం.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవాలు, పూజలు మనసుకు సాంత్వన కలిగిస్తాయి. ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి. నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూల సమయం. సూర్యాష్టకపారాయణ శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ