Today Horoscope : ఈ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి !
ABN , Publish Date - Jul 14 , 2024 | 05:59 AM
నేడు (14-07-2024- అదివారం ) కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. వేడుకలు, సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి.
నేడు (14-07-2024- అదివారం )కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. వేడుకలు, సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. వేడుకలు, సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి. శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఇంటర్వ్యూలలో నిరాశ ఎదురవుతుంది. సన్నిహితులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. పరిశ్రమలు, వైద్యం, హోటల్ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. లలితా దేవి ఆరాధన మేలు చేస్తుంది.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. టెలివిజన్, క్రీడలు, చిట్ఫండ్లు, ఆడ్వర్టయిజ్‌మెంట్, కన్సల్టెన్సీ రంగాల వారికి ఆర్థికంగా నిరుత్సాహకరంగా ఉంటుంది. సంకల్ప సాధనలో ఆటంకాలు ఎదురవుతాయు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగస్తుంది. దూరంలో ఉన్న ప్రియతములు ఇల్లు చేరడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. అమ్మవారిని ఆరాధించండి.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. తోబుట్టువులు, సన్నిహితుల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యా సంస్థలు, రవాణా మార్కెటింగ్ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. దుర్గామాత ఆరాధన శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో అనుకోని సమస్యలు ఎదుర య్యే అవకాశం ఉంది. తొందపపాటు నిర్ణయాల కారణంగా నష్టం జరగవచ్చు. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత పదవులు, ప్రమోషన్ల విషయంలో కొంత నిరాశ ఎదురవుతుంది. పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగే అెకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదే శీ ప్రయాణాలకు అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. రాజకీయ, సినీరంగాల వారు నిదానం పాటించాలి. కొత్త వ్యూహాల అమలుకు సరైన సమయం కాదు. దూరంలో ఉన్న బంధుమిత్రులను కలుసుకుంటారు.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురువుతాయి. పందాలు పోటీలకు దూరంగా ఉండటం మేలు. షేర్‌మార్కెట్ లావాదేవీలు, ఇతర పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. వైద్య సేవలకు ఖర్చులు అధికం. దుర్గా మాతను ఆరాధించండి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
సంకల్ప సాదనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు తగిన సమయం కాదు. సమావేశాల్లో మాటపడాల్సి రావచ్చు. వృత్తిపరమైన లక్ష్య సాధనలో భాగస్వాయి సహకారం లోపిస్తుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురవుతాయి. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్, వైద్య రంగాల వారికి అంచనాలు ఫలించవపోచ్చు. న్యాయ పరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సకాలంలో డబ్బు చేతికి అందుక ఇబ్బంది పడతారు. ఖ ర్చులు అంచనాలు మించిపోతాయి. చిన్నారుల ఆ రోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పెన్షన్, బీమా, గ్యాట్యుటీ సమస్యలు పరిష్కారం అవుతాయి. దుర్గామాతను ఆరాదించండి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ