Share News

Today Horoscope : ఈ రాశి వారు వివాహాది శుభకార్యాల పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

ABN , Publish Date - Dec 24 , 2024 | 02:00 AM

నేడు (24-12-2024- మంగళవారం) వేడుకల్లో పెద్దలను కలుసకుంటారు. వివాహ నిర్ణయాలకు అనుకూలం.

Today Horoscope : ఈ రాశి వారు వివాహాది శుభకార్యాల పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

నేడు (24-12-2024- మంగళవారం) వేడుకల్లో పెద్దలను కలుసకుంటారు. వివాహ నిర్ణయాలకు అనుకూలం.

01 Mesham - Aries.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో పెద్దలను కలుసకుంటారు. వివాహ నిర్ణయాలకు అనుకూలం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. నూతన భాగస్వామ్యాలకు, పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలకు అనుకూలమైన రోజు.


02 Vrushabham - Taurus.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆస్పత్రులు, ఫార్మా, కేటరింగ్‌ ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయం, పరిశ్రమలు, సిబ్బంది నియామకాల రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. సహోద్యోగులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సంకల్పం నెరవేరుతుంది.


03 Mithunam - Gemini.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. చిట్‌ఫండ్‌, క్రీడలు, ఆడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరమైన రోజు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.


04 Karkatakam - Cancer.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

వివాహాది శుభకార్యాలపై ఒక నిర్ణయం తీసుకుంటారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం.


05 Simha - Leo.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. సహోద్యోగులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఒక శుభవార్త అందుకుంటారు.


06 Kanya - Virgo.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. చిన్నారుల విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. సంక ల్పం నెరవేరుతుంది.


07 Tula - libra.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. నిర్మాణ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. మీ ఆలోచనలో మార్పు వస్తుంది.


08 Vruschikam - Scorpio.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

కమ్యూనికేషన్లు, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సినిమాలు, రాజకీయ, కళా రంగాల వారికి అనుకూల సమయం. శుభవార్త అందుకుంటారు. తోబట్టువుల విషయంలో మంచి పరిణామాలు జరుగుతాయి.


09 Dhanassu - Sagittarius.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు లాభిస్తాయి. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సహకార సంఘాలు, యూనియన్‌ వర్గాలకు ఆర్థికంగా అనుకూలమైన రోజు.


10 Makaram - Capricorn.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

గౌరవ మర్యాదలు అందుకుంటారు. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు సంభవం. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధించేందుకు కొత్త ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దలను కలుసుకుంటారు.


11 Kumbham - Aquarius.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

వీసా, పాస్‌పోర్డ్‌ పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బృందకార్యక్రమాల్లో ఆనందంగా గడుపుతారు. విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.


12 Meenam - Pisces FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. పెట్టుబడుల విషయంలో సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. సకాలంలో నిధులు చేతికి అందుతాయి. బీమా, పన్నులు, మెడికల్‌ క్లెయిముల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Dec 24 , 2024 | 02:00 AM