Share News

Today Horoscope : ఈ రాశి వారికి ఖర్చుల అంచనాలు మించే అవకాశం ఉంది

ABN , Publish Date - Oct 29 , 2024 | 02:35 AM

నేడు (29-10-2024-మంగళవారం) ఆరోగ్యం పట్ల శద్ధ్ర చూపించాలి. విందు వినోదాల్లో పరిమితి పాటించడం అవసరం.

Today Horoscope : ఈ రాశి వారికి ఖర్చుల అంచనాలు మించే అవకాశం ఉంది

నేడు (29-10-2024-మంగళవారం) ఆరోగ్యం పట్ల శద్ధ్ర చూపించాలి. విందు వినోదాల్లో పరిమితి పాటించడం అవసరం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం పట్ల శద్ధ్ర చూపించాలి. విందు వినోదాల్లో పరిమితి పాటించడం అవసరం. సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వైద్య, ఆహారం, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.


02 Vrushabham.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

జనసంబంధాలు విస్తరిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. బందుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక విష యాల్లో తొందరపాటు తగదు. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య కవచ పారాయణ శుభప్రదం.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణ రంగాల వారికి లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. విద్యార్థులు పట్టుదలతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలు, చర్చల విషయాలో జాగ్రత్తలు పాటించాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు. ఖర్చుల అంచనాలు మించే అవకాశం ఉంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన శుభప్రదం.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. డ్రైవింగ్‌లో నిదానం అవసరం. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. మార్కెటింగ్‌, విద్య, వాహన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

సినీ, రాజకీయ రంగాల వారికి మనశ్శాంతి లోపిస్తుంది. అన్ని పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. దూరప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అెుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.


08 VRUSHABAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

బందుమిత్రుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. వేడుకలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. లక్షీ మనరసింహ స్వామి స్తోత్ర పారాయణ శుభప్రదం.


09 DANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. పెద్దల వైఖ రి కారణంగా మనశ్శాంతి లోపిస్తంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఉన్నత విద్య విషయంలో పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ప్రయాణాలు, వేడుకల్లో ఖర్చులు అధికం. లక్ష్య సాధనలో అటంకాలు ఎదురవుతాయి. సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాలి. లక్ష్మీనరసింహ కరావలం స్తోత్ర పారాయణ శుభప్రదం.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. రుణ ప్రయత్నాలు ఫలించక పోవచ్చు. బోనస్‌లు, ఇంక్రిమెట్లు, బీమా క్లెయిములు అందుకుంటారు. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.


12 MEENAM FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. చర్చలు, సమావేశాల్లో మాటపడాల్సి వస్తుంది. పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి. ప్రియతములతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభ ప్రదం.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Oct 29 , 2024 | 02:35 AM