Share News

Today Horoscope : ఈ రాశుల వారికి ఆర్థికంగా లాభం !

ABN , Publish Date - Jun 18 , 2024 | 06:04 AM

నేడు (18-06-2024 - మంగళవారం ) ఆర్థిక పరమైన చర్చలు ఫలిస్తాయి. వైద్యం, ఫార్మా, హార్డ్‌వేర్‌ రంగాల వారు ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.

Today Horoscope : ఈ రాశుల వారికి ఆర్థికంగా లాభం !

నేడు (18-06-2024 - మంగళవారం ) ఆర్థిక పరమైన చర్చలు

ఫలిస్తాయి. వైద్యం, ఫార్మా, హార్డ్‌వేర్‌ రంగాల వారు ముఖ్యమైన

సమాచారం అందుకుంటారు.

MESHAM-01 - Copy - Copy - Copy (2) - Copy.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరమైన చర్చలు ఫలిస్తాయి. వైద్యం, ఫార్మా, హార్డ్‌వేర్‌ రంగాల వారు ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. పన్నులకు సంబంధించిన పత్రాలు సేకరిస్తారు. సన్నిహితుల ఆరోగ్యం కొంత కలవరం కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.


MESHAM-02 - Copy - Copy - Copy (2).jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో ఆచితూచి వ్యవహరించాలి. న్యాయ వ్యవహారాల్లో ఖర్చులు అధికం. ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం శుభప్రదం.


MESHAM-03 - Copy - Copy - Copy.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

హోటల్‌, ఫార్మా, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ద తీసుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.


MESHAM-04 - Copy - Copy - Copy (2).jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

క్రీడలు, విద్యాసంస్థలు, చిట్‌ఫండ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థుకు అనుకూలమైన రోజు. చిన్నారులు, ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఖ్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి.


MESHAM-05 - Copy (2) - Copy - Copy.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

బదిలీలు, మార్పులకు అనుకూలం. సన్నిహితుల వైఖరిలో మార్పులు గమనిస్తారు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకంగా ఉంటుంది. ఇంటికి అవసరమైన నిధుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.


MESHAM-06 - Copy - Copy - Copy.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

విద్యా సంస్థల్లో ప్రవేశానికి పెద్దల సహకారం లభిస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. ప్రయాణాలకు కావలసిన నిధులు అందుతాయి. పెద్దలలో చర్చల సమయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.


MESHAM-07 - Copy - Copy - Copy.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇల్లు, స్థల సేకరణకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ఉన్న త పదవుల కోసం ప్రయత్నాలు చేస్తారు. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూల సమయం. కుటుంబ వ్యవహారాలు కొంత అ సౌకర్యం కలిగిస్తాయి.


MESHAM-08 - Copy.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

బిల్లులు మంజూరవుతాయి. ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాలు అవుతాయి. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాట పెట్టే అవకాశం ఉంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.


MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైన సమావేశాలు సత్ఫలితాలనిస్తాయి. షేర్‌ మార్కెట్‌ లావాదేవీలు, పందాలు, పోటీలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్య అష్టకపారాయణ శుభ ప్రదం.


MESHAM-10 - Copy.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

కొత్త పనులను ప్రారంభించడంపై దృష్టి పెడతారు. వైద్యం, హోటల్‌, ఫార్మా రంగాల వారికి పోత్సాహకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.


MESHAM-11 - Copy.jpg

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్నారులు, ప్రియతములకు సంబంధించి శుభవార్త అందుకుంటారు. సినిమాలు, రాజకీయ రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.


MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇల్లు, స్థల సేకరణకు అ వసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. హనుమాన్‌ చాలీసా పారాయణం శుభప్రదం.

- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - Jun 18 , 2024 | 06:04 AM