Share News

Today Horoscope : ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో తోబుట్టువుల సహకారం లభిస్తుంది.

ABN , Publish Date - Aug 21 , 2024 | 04:09 AM

నేడు (21-8-2024- బుధవారం) ప్రియతములతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు.

Today Horoscope : ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో తోబుట్టువుల సహకారం లభిస్తుంది.

నేడు (21-8-2024- బుధవారం) ప్రియతములతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ప్రియతములతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. మెయిల్‌, వాట్సాప్‌ సందేశాలు ఆనందం కలిగిస్తాయి. గణపతి ఆరాధన శుభప్రదం


02 VRUSHABAMAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

బ్యాంకులు, సహకార సంఘాలు, ఫైనాన్స్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటిక కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు సంబంధించిన ఒక నిర్ణయానికి వస్తారు. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ రామచంద్రుని ఆరాధించండి.


03 MITHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాల ఫలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. పైఅధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ముఖ్యమైన సమాచారం లభిస్తుంది. గౌరవ, మర్యాదలు అందుకుంటారు. విష్ణుసహస్ర నామ పారాయణ శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాలకు సంబంధించిన చచర్చలు, ప్రయాణాలకు అనుకూలం. వేడుకలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. పారితోషికాలు అందుకుంటారు. పెట్టుబడుల విషయంలో మీ అంచనాలు ఫలిస్తాయి. శ్రీరామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.


05 SIMHAM.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

వైద్యం, పరిశోధనలు, ఫార్మా, ఇన్సూరెన్స్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గణపతి ఆరాధన శుభప్రదం.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవారంగాల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీరామచంద్రమూర్తి ఆరాదన శుభప్రదం.


07 THULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

హోటల్‌, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. మెడికల్‌ క్లెయిములు మంజూరవుతాయి. గణపతి ఆరాధన శుభప్రదం.


08 VRUSHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. చిట్‌ఫండ్‌, పాఠశాలలు, అడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాల్లోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారుల విషయంలో శుభపరిణామలు చోటుచేసుకుంటాయి. పెట్టుబడుల విషయంలో పెద్దల సహకారం లభిస్తుంది. శ్రీ రామచంద్ర మూర్తిని ఆరాధించండి.


09 DHANASSU.jpg

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. దూరంలో ఉన్న బంధుమిత్రులు ఇల్లు చేరుకుంటారు. పాస్‌పోర్ట్‌, వీసా పనులు పూర్తవుతాయి. కొంత కాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో తోబుట్టువుల సహకారం లభిస్తుంది. విద్య, ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. స్టేషనరీ, మార్కెటింగ్‌, రవాణా, విద్యా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతికి సంబంధించిన విషయాల్లో శుభపరిణామలు సంభవం. భాగస్వామ్యాలు లాభిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. బ్యాంకులు, ఫైనాన్స్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


12 MEENAM.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. వ్యాపార రంగంలో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. సిబ్బంది నియామకాలకు అనుకూలమైన రోజు. కేటరింగ్‌, ఫార్మా, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీ రామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Aug 21 , 2024 | 04:09 AM