Today Horoscope : ఈ రాశి వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి !
ABN , Publish Date - Jul 03 , 2024 | 05:54 AM
నేడు (03-07-2024-బుదవారం) అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక శుభవార్త అందుకుంటారు.
నేడు(03-07-2024-బుదవారం) అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక శుభవార్త అందుకుంటారు.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక శుభవార్త అందుకుంటారు. రవాణా, స్టేషనరీ, మార్కెటింగ్, కమ్యూనికేషన్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. చర్చలు, ప్రయాణాల్లో నిదానం అవసరం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఫైనాన్స్, చిట్‌ఫండ్‌లు, బ్యాంకుల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన పత్రాలు అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. బంగారం, ఆభరణాలు, వడ్డీ వ్యాపారులు నిదానం పాటించాలి.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడుల విషయంలో కొత్త ఆలోచనలు చేస్తారు. చొరవ, నైపుణ్యం, భిన్నమైన ఆలోచనలతో పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. సకాలంలో నిధులు సర్దుబాటు కాకపోవడంతో కొంత ఇబ్బంది పడతారు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
సంకల్పం నెరవేరుతుంది. సినిమాలు, రాజకీయాలు, కన్సల్టెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూల సమయం. చేపట్టిన పనులకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అ వకాశం ఉంది. శ్రీ రామచంద్ర మూర్తి శుభ ప్రదం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. షేర్‌మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సమావేశాల్లో కొంత అసౌకర్యం కలగవచ్చు.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారరంగంలోని వారికి మెరుగైన అవకాశాలు వస్తాయి. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెద్దల నుంచి ఆశించిన సహకారం లభించక నిరుత్సాహానికి గురవుతారు.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వీసా, పాస్‌పోర్ట్ పనులకు అనుకూలం. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. రవాణా, బోధన, పోలీస్, న్యాయ, ఆడిటింగ్ రంగాల వారికి ప్రోత్సాహరంగా ఉంటుంది. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల కోసం ఖ ర్చు చేస్తారు. షేర్‌మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్‌లో పెట్టుబడులకు అనుకూలం. పెన్షన్, బీమా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తాయి. స్టాక్‌మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి. ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
కేటరింగ్, సేవలు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సిబ్బంది నియామకాలకు అనుకూల సమయం. ఆరోగ్యం పట్ల శ్రధ్ద చూపాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
క్రీడలు, పాఠశాలలు, టెలివిజన్, సృజనాత్మక రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియతముల విషయంలో శుభపరిణామాలు చోటుచే సుకుంటాయి. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు ఉపయోగపడతాయి.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు మంచి ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. లక్ష్య సాధనలో కుటుంబ సభ్యుల సహకారం లోపిస్తుంది.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ