Share News

Today Horoscope : ఈ రాశి వారికి ఊహించని శుభప్రదం !

ABN , Publish Date - Jun 26 , 2024 | 06:05 AM

నేడు (26-06-2024-బుధవారం)రియల్‌, ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బంధుమిత్రులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు.

Today Horoscope :  ఈ రాశి వారికి ఊహించని శుభప్రదం !

నేడు (26-06-2024-బుధవారం) రియల్‌, ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బంధుమిత్రులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు.

MESHAM-01 - Copy - Copy - Copy - Copy.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

రియల్‌, ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బంధుమిత్రులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల రంగాల వారికి వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. యూనియన్‌ కార్యకలాపాల్లో విజయం సాధిస్తారు.


MESHAM-02 - Copy - Copy - Copy - Copy - Copy.jpg

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. పొదుపు పథకాలు, విద్యా విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.


MESHAM-03 - Copy - Copy - Copy - Copy.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాలకు సంబంధించిన ప్రయాణాలు, సమావేశాలు ఫలిస్తాయి. కొత్త వ్యూహాలు అమలు చేసి విజయం సాధిస్తారు. రక్షణ, బోధన, న్యాయ, కన్సల్టెన్సీ విద్యా రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అంచనాలు ఫలిస్తాయి.


MESHAM-04 - Copy - Copy - Copy.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బిల్లులు, ఫీజులు చెల్లిస్తారు. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. రుణాలు, పెట్టుబడులు, షేర్‌మార్కెట్‌ లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలు అందుకుంటారు.


MESHAM-05 - Copy (2) - Copy.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. బృందకార్యక్రమాలు, వేడుకల కోసం ఖర్చు చేస్తారు. గణపతిని ఆరాధించండి.


MESHAM-06 - Copy - Copy.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం, యోగ, ఆహార నియమాల విషయంలో శ్రద్ధ చూపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. శ్రీ రామ రక్షాకవచ పారాయణ శుభప్రదం.


MESHAM-07 - Copy - Copy - Copy.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

చిన్నారులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. గత అనుభవంతో ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రియతములకు సంబంధించి ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు. శ్రీ రామచంద్ర మూర్తి ఆరాధన శుభప్రదం.


MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా వుంటుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా వుంటుంది. గోసేవ శుభప్రదం.


MESHAM-09 - Copy.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులకు లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రముఖులతో చర్చలు, సమావేశాలకు అనుకూలం. వాహన యోగం వుంది. సోదరీ, సోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సేవా కార్యక్రమాలు సాంత్వన కలిగిస్తాయి.


MESHAM-10 - Copy.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వేడుకలకు అవసరమైన నిధులు సమకూరతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించిన వ్యూహాలు ఫలిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.


MESHAM-11 - Copy.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. హోటల్‌, వైద్యం, రిటైల్‌ వ్యాపారాల వారికి ఆర్థికంగా అనుకూలిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు. గోసేవ శుభప్రదం.


MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ప్రియతములకు సంబంధించి రహస్య సమాచారం తెలుసుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనకూలంగా ఉంటుంది. రాజకీయ, సినీ రంగాల వారికి జనసంబంధాలు విస్తరిస్తాయి. టెలివిజన్‌, రచనా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jun 26 , 2024 | 06:49 AM