Varalakshmi Vratham 2024: వరలక్ష్మి వ్రతం వేళ.. ఏ రంగు చీర కట్టుకోవాలంటే..
ABN , Publish Date - Aug 15 , 2024 | 02:54 PM
ఈ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం.. వరలక్ష్మీ శుక్రవారం. ఆ రోజు మహిళలంతా ఆష్టలక్ష్ముల అనుగ్రహం కోసం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తారు. మరి ఆ రోజు అమ్మవారి అనుగ్రహం పొందేందుకు మహిళలు ఏం చేయాలి. ఏం చేయకూడదు. ఏ రంగు చీరలు ధరించాలి. ఏ రంగు చీరలు ధరించ కూడదనే విషయాన్ని జోతిష్య పండితులు సోదాహరణగా వివరిస్తున్నారు.
శుభముహూర్తాలకు నెలవైన మాసం శ్రావణ మాసం. అందుకే గృహప్రవేశాలు, పెళ్లి పేరంటాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ ఈ మాసంలోనే పెట్టుకుంటారు. ఈ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం.. వరలక్ష్మీ శుక్రవారం. ఆ రోజు మహిళలంతా ఆష్టలక్ష్ముల అనుగ్రహం కోసం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తారు. మరి ఆ రోజు అమ్మవారి అనుగ్రహం పొందేందుకు మహిళలు ఏం చేయాలి. ఏం చేయకూడదు. ఏ రంగు చీరలు ధరించాలి. ఏ రంగు చీరలు ధరించ కూడదనే విషయాన్ని జోతిష్య పండితులు సోదాహరణగా వివరిస్తున్నారు. అదీకాక జోతిష్య శాస్త్రం ప్రకారం... రంగులనేవి.. గ్రహాలకు సంకేతం.
వరలక్ష్మీ వ్రతం భక్తితో ఆచరించే మహిళలు ఏ రంగు చీరనైనా కట్టుకోవచ్చు. శ్రీసూక్తంలో మొదటి శ్లోకం ప్రకారం.. లక్ష్మీదేవికి బంగారు రంగు చీర అంటే మహా ప్రీతి. బంగారపు రంగు ఉండే చీరను ధరించి పూజ చేస్తే మహిళలకు మంచి ఫలితం.. అదీ కూడా శీఘ్రగతిన కలుగుతుంది. ఇక మహాలక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు కూడా ఎంతో ప్రీతికరమైనది. ఆ రోజు లక్ష్మీకటాక్షం కోసం ఆకు పచ్చ రంగు చీరనైనా ధరించవచ్చు. అలాగే లక్ష్మీదేవికి గులాబీ రంగు అంటే మహా ఇష్టం.
Also Read: Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతానికి శుభ ముహూర్తం ఇదే..
ఈ చీరను ధరించి వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే సంపూర్ణంగా ఆ అమ్మవారి అనుగ్రహం పొంద వచ్చునని జోతిష్య పండితులు పేర్కొంటున్నారు. అదే విధంగా గోధుమ, పసుపు రంగు చీరలను సైతం మహిళలు ధరించి ఈ వ్రతమాచరిస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. అయితే ఈ వ్రతమాచరించే వేళ.. నలుపు, నీలం, బూడిద రంగుల్లో ఉండే చీరలు మాత్రం ధరించవద్దని మహిళలకు జోతిష్య పండితులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు. ఈ రంగు చీరలు ధరించి వ్రతమాచరిస్తే.. లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగకపోగా.. శని దేవుని ఆగ్రహానికి మహిళలు గురికావడం ఖాయమని జోతిష్య పండితులు వివరిస్తున్నారు.